బ్రేకప్ రూమర్స్కి ఎండ్ కార్డ్.. మలైకా, అర్జున్ నైట్ డిన్నర్

బ్రేకప్ రూమర్స్కి ఎండ్ కార్డ్.. మలైకా, అర్జున్ నైట్ డిన్నర్

బాలీవుడ్ యాక్టర్ అర్జున్ కపూర్(Arjun Kapoor), హీరోయిన్ మలైకా అరోరా(Malaika Arora) లవర్స్ అని అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్గా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయిపొయింది. దాదాపు ఐదేళ్లుగా డేటింగ్లో ఉన్నఈ బాలీవుడ్ జంట బ్రేకప్ అనే న్యూస్ రాగానే చాలా మంది హార్ట్ అయినట్లు కనిపించింది.  

లేటెస్ట్గా మలైకా అరోరా..అర్జున్ ముంబైలో బాలీవుడ్ కెమెరాకి చిక్కారు. దీంతో ఈ గాసిప్స్కి ఎండ్ కార్ద్ పడింది. ఇక వీరిద్దరూ డిన్నర్ డేట్కి వెళ్లొచ్చినట్లు తెలుస్తుంది. ముంబైలో నైట్ రెస్టారెంట్ నుంచి ఈ జంట బయటికి రావడంతో..వీరి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇక మలైకా వైట్ కోట్తో కనిపించగా.. అర్జున్ కపూర్ బ్లాక్ టీ షర్ట్..బ్లాక్ స్పెక్టికల్స్ తో కనిపించారు.

ఈ ఫోటోలో మలైకా ముందు నడుస్తూ కనిపించగా..తన వెనుకాలే అర్జున్ నడుచుకుంటూ వస్తున్నాడు.ఇక బాలీవుడ్ మీడియా ఫుల్ జోష్ ఉన్నట్లు  టాక్. సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ వైరల్ కావడంతో.. ఇక ఈ గాసిప్స్ నమ్మేవాళ్లే..పిచ్చివాళ్ళు అంటూ..నెటిజన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్తో రెచ్చిపోతున్నారు.   

రీసెంట్గా బాలీవుడ్ యాక్టర్స్ కుషా కపిలాతో అర్జున్ కపూర్ డేటింగ్లో ఉన్నట్లు గాసిప్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఇక మలైకా అరోరా..అర్జున్ కపూర్ కలవకపోవొచ్చు అని బాలీవుడ్ మీడియాలో అందరు అనుకున్నారు. అలాగే మలైకా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్లో అర్జున్ కపూర్ సిస్టర్స్ అయినా..జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లను అన్‌ఫాలో చేసింది.అంతేకాదు అన్షులా కపూర్, బోనీ కపూర్ లను కూడా ఆమె అన్ ఫాలో అయింది. ఇక వీరి బ్రేకప్ మ్యాటర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. త్వరలో వీరిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారని మరో గాసిప్ షురూ అయింది.