ప్రముఖ హీరోయిన్ మందిరా బేడి భర్త మృతి

ప్రముఖ హీరోయిన్ మందిరా బేడి భర్త మృతి

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మందిరా బేడి భర్త, నిర్మాత రాజ్ కౌషల్ (49) మరణించారు. ఆయన బుధవారం ఉదయం కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతిచెందారు. రాజ్ కౌషల్ మరణవార్తను ధృవీకరిస్తూ నిర్మాత ఒనిర్ ట్వీట్ చేశారు. రాజ్ కౌషల్ 2005లో వచ్చిన మై బ్రదర్ నిఖిల్ అనే సినిమా ద్వారా నిర్మాతగా పరిచయమయ్యారు. రాజ్ అంత్యక్రియలు దాదర్ శివాజీ పార్క్‌లో జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

మందిరా బేడి మరియు రాజ్ కౌషల్ 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి వీర్ అనే 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మందిరా దంపతులు గత ఏడాది జూలైలో 4 ఏళ్ల తారా అనే బాలికను దత్తత తీసుకున్నారు. 

రాజ్ కౌషల్ సినీ నిర్మాతగానే కాకుండా.. రచయితగా మరియు దర్శకుడుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం. రాజ్ కాపీ రైటర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత 1998లో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. అప్పటి నుంచి ఆయన 800 వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించాడు.