మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి

 మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి చనిపోయినట్లు పార్టీ ప్రకటించింది.  కేంద్ర కమిటీలో టెక్నీకల్ టీమ్ సభ్యులుగా ఉన్న రవి.... జార్ఖండ్ లోని మారుమూల ప్రాంతంలో చనిపోయినట్లు తెలిపింది. కమ్యూనికేషన్ తో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్ తయారు చేయటంలో రవికి మంచి పట్టున్నట్లు పేర్కొంది. అయితే రవి చనిపోయిన ఏడాది తర్వాత అధికారికంగా ప్రకటన చేసింది మావోయిస్టు కేంద్ర కమిటీ. ఇప్పటి వరకు రవి మృతిపై క్లారిటీ లేదని.. ఇప్పుడు స్పష్టత రావడంతో అధికారిక ప్రకటన విడుదల చేసినట్టు మావోయిస్టులు చెబుతున్నారు.