ఎక్కువ IASలు ఢిల్లీ నుంచే..

ఎక్కువ IASలు ఢిల్లీ నుంచే..

దేశ రాజధాని నుంచే ఎక్కువ మంది  ఐఏఎస్‌‌‌‌కు సెలక్ట్‌‌‌‌ అవుతున్నారు.   2017–-18  యూపీఎస్సీ  ఫలితాల్లో ఒక్క ఢిల్లీ నుంచే 17 మంది  ఐఏఎస్‌‌‌‌కు ఎంపికయ్యారని స్టాటిస్టిక్స్‌‌‌‌  చెప్పాయి.  ఎక్కువగా ఐఏఎస్‌‌‌‌లు వస్తున్న రాష్ట్రాల రికార్డును మాత్రం ఉత్తరప్రదేశ్‌‌‌‌ (28), రాజస్థాన్‌‌‌‌ (22), మహారాష్ట్ర (18)  కొనసాగిస్తూనే ఉన్నాయి.  మరోవైపు, ఏటా ఐఏఎస్‌‌‌‌ పోస్టులు తగ్గుతున్నాయి. 2008లో 240 మంది ఐఏఎస్‌‌‌‌లను యూపీఎస్సీ ఎంపిక చేసింది.  ఈమధ్యకాలంలో  ఆ సంఖ్య 180కి పడిపోయింది. అయినా ఢిల్లీలో మాత్రం ఐఏఎస్‌‌‌‌కు క్రేజ్‌‌‌‌ తగ్గడంలేదని కోచింగ్‌‌‌‌ సెంటర్ల  నిర్వాహకులు చెప్పారు.

ఢిల్లీ నుంచే ఎక్కువ మంది సివిల్స్‌‌‌‌ రాయడానికి ఆసక్తి చూపిస్తున్నారని యూపీఎస్సీ అధికారి ఒకరు చెప్పారు.  మిగతా సిటీలతో పోల్చుకుంటే 12వ తరగతి నుంచే ఢిల్లీలోని స్టూడెంట్స్‌‌‌‌ సివిల్స్‌‌‌‌ కోచింగ్‌‌‌‌ తీసుకుంటున్నారన్నారు.  ఇప్పుడు చాలా మంది ప్రైవేట్‌‌‌‌ సెక్టర్‌‌‌‌ నుంచి గవర్నమెంట్ సెక్టర్‌‌‌‌కు రావాలని ఆసక్తి చూపిండచం కూడా ఈ సంఖ్యపెరగడానికి కారణమని రిటైర్డ్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ అధికారి ఒకరు చెప్పారు. మారిన యూపీఎస్సీ  ఎగ్జామ్‌‌‌‌  విధానం కూడా ఢిల్లీ లాంటి అర్బన్‌‌‌‌ సెంటర్లలో చదువుకున్నవాళ్లకు అనుకూలంగా ఉంటోంది. 2011 నుంచి సివిల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ (సీశాట్‌‌‌‌) విధానం వల్ల ఇంగ్లీష్‌‌‌‌ మీడియం స్టూడెంట్లే దీనిలో బాగా రాణిస్తున్నారు. ఢిల్లీలాంటి సిటీలో ఏటా 17 నుంచి19 మంది ఐఏఎస్‌‌‌‌కు సెలక్ట్‌‌‌‌ అవ్వడం  గొప్పవిషయం కాదని మరికొంతమంది కోచింగ్‌‌‌‌ సెంటర్ల నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. నేషనల్‌‌‌‌ కేపిటల్‌‌‌‌లో ఉన్నన్ని  కోచింగ్‌‌‌‌ సెంటర్లు దేశంలో మరెక్కడా లేవు.

ఢిల్లీకి ఎందుకు  అనుకూలమంటే ?

    సెకెండరీ స్థాయి నుంచే కోచింగ్‌‌‌‌పై స్టూడెంట్స్‌‌‌‌ ఆసక్తి.

    ఎక్కువ కోచింగ్‌‌‌‌ సెంటర్లు ఉండడం.

    మారిన యూపీఎస్సీ సిస్టమ్‌‌‌‌ అనుకూలంగా ఉండడం.

    చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్‌‌‌‌ మీడియం చదువులు.