వజ్రంలో వజ్రం.. వెలకట్టలేని వజ్రం

వజ్రంలో వజ్రం.. వెలకట్టలేని వజ్రం

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. దేంతోనూ తెగనంత గట్టిగా ఉంటుంది మరి అది. మరి, ఎప్పుడైనా వజ్రంలో వజ్రాన్ని చూశారా? చూసి ఉండరు కదా. అలాంటి ఓ వజ్రమే సఖా రిపబ్లిక్​ (యకూతియా)లోని న్యూర్బా వజ్రాల గనిలో దొరికింది. రష్యా డైమండ్​ సంస్థ అల్రోసా దాన్ని ప్రాసెస్​ చేయిస్తోంది. ఈ వజ్రానికి ‘మేత్రియోష్కా’ అని పేరు పెట్టారు. రష్యాలో దొరికే సంప్రదాయ బొమ్మ లోపల బొమ్మను పోలి ఉండడం వల్లే దానికి ఆ పేరు పెట్టారని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఇలాంటి వజ్రం లోపల వజ్రం ఎక్కడా దొరకలేదు. ఇదే మొదటిది. దాని వయసు 80 కోట్ల ఏళ్లని చెబుతున్నారు. వెల కట్టలేనిదంటున్నారు. పెద్ద వజ్రం బరువు 0.62 క్యారెట్లు.  లోపల ఉన్న చిన్న వజ్రం బరువు 0.02 క్యారెట్లట. దీనిని టెస్టు చేయించేందుకు అమెరికాలోని జెమాలాజికల్​ ఇనిస్టిట్యూట్​కు పంపిస్తామని కంపెనీ చెప్పింది.