మార్కులు, ఉద్యోగాల కోసమే చదువుతున్నరు..రీసెర్చ్ పై దృష్టి పెట్టడం లేదు: మంత్రి ఈటల

మార్కులు, ఉద్యోగాల కోసమే చదువుతున్నరు..రీసెర్చ్ పై దృష్టి పెట్టడం లేదు: మంత్రి ఈటల

హైదరాబాద్​, వెలుగు:  అప్పటి చదువుకు, ఇప్పటి చదువుకు ఎంతో తేడా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గతంలో కల్చర్​, ట్రెడిషన్​, హ్యూమన్​ రిలేషన్స్​కోణంలో ఎడ్యుకేషన్ ఉండేదని, కానీ ఇప్పుడు మార్కులు, ఉద్యోగం కోసమే అన్నట్టు సాగుతోందన్నారు. రెండు రోజుల కింద మినిస్టర్ హరీశ్​రావు ఓ స్కూల్​కు వెళ్లి ఎక్కాలు అడిగితే చెప్పలేకపోయారని గుర్తుచేశారు. ఆదివారం తెలంగాణ రికగ్నైజ్డ్‌‌ స్కూల్స్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ అసోసియేషన్‌‌(ట్రస్మా) ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని హైటెక్స్‌‌ ఎగ్జిబిషన్‌‌ సెంటర్లో ఎడ్యుకేషన్‌‌ ఎక్స్‌‌పో –- 2019 ముగింపు కార్యక్రమానికి ఆయన చీఫ్​ గెస్ట్​గా వచ్చి మాట్లాడారు. స్టూడెంట్స్​ అంతా ‘సాప్ట్ వేర్’ వైపే చూస్తున్నారని, రీసెర్చ్​ వైపు ఎవరూ దృష్టి పెట్టడం లేదన్నారు. ఈ కాంపిటీషన్ లో పెద్ద విద్యాసంస్థలు, చిన్న వాటిని మింగివేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సెల్​ఫోన్లు, ఇంటర్​నెట్​లో అశ్లీలతను ప్రభుత్వం నియంత్రించాలని కోరారు.

ఇంగ్లిష్​ అవసరమే కానీ…

రెండో రోజు సదస్సును ప్రారంభించిన రాష్ర్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయిన్​పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో స్కూల్​కు వెళ్లే స్టూడెంట్స్​సంఖ్య పెరుగుతుందని, దీనివల్ల ఎడ్యుకేషనల్​ ఇన్​స్టిట్యూషన్స్​ అవసరం పెరుగుతుందన్నారు. ఇంగ్లిష్​ అవసరమే కానీ.. ఆ మోజులో పడి మాతృభాషను మరవద్దన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్స్ పో లో లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు వై. శేఖర్ రావు, రాష్ర్ట నాయకులు ప్రసాద్ రావు, మధుసూదన్, భాషిత సుందర్, మానస గణేష్, ప్రగతి ఆధినాథ్, వేదవ్యాస్, విద్యారంగ నిపుణులు అంజూమ్ బాబుఖాన్, జ్యోతిరెడ్డి పాల్గొన్నారు.