నేలపై పడుకొని సెలైన్ ఎక్కించుకుంటున్న ఈయన పేషెంట్ కాదు. జార్ఖండ్ రాష్ట్రంలోని కంకె నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సమ్మరి లాల్. హేమంత్ సోరెన్ సర్కారు రిమ్స్ ఆసుపత్రిపై నిర్లక్ష్యం వహిస్తున్నదని, సరైన వైద్య సేవలు అందించడం లేదని, రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ఆయన గురువారం ఇలా నిరసన తెలిపారు.
