Mohanlal-Shah Rukh Khan: మీ ఇంట్లోనా..లేదా మా ఇంట్లో చేద్దామా..మోహన్‌ లాల్‌ డాన్స్పై షారుక్‌ ఖాన్‌ ట్వీట్

Mohanlal-Shah Rukh Khan: మీ ఇంట్లోనా..లేదా మా ఇంట్లో చేద్దామా..మోహన్‌ లాల్‌ డాన్స్పై షారుక్‌ ఖాన్‌ ట్వీట్

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్(Shah rukh khan) హీరోగా వచ్చిన పాన్ ఇండియా మూవీ జవాన్(Jawan). తమిళ దర్శకుడు అట్లీ కుమార్(Atlee kumar) తెరకెక్కించిన ఈ లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

ఈ మూవీలోని జిందా బందా సాంగ్ సోషల్ మీడియాలో చార్ట్ బ్లాస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.అప్పట్లో రిలీజ్ అయినా 24 గంటల్లోనే 46+ మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేసింది. తెలుగులో దుమ్ము దులిపేలా అంటూ చంద్రబోస్ ఈ సాంగ్ ను రచించగా..మంగ్లీ, అనిరుధ్ పాడారు.  షారుఖ్,ప్రియమణి దుమ్ము లేపేలా డ్యాన్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ వ్యూస్ తో యూట్యూబ్ ట్రెండ్ అయింది. 

లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ (Anirudh) సంగీతం అందించిన సాంగ్‌కు మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్(Mohanlal) డ్యాన్స్ చేశారు. ఆ దృశ్యాలను ‘షారుక్‌ ఖాన్‌ యూనివర్స్‌ ఫ్యాన్ క్లబ్‌’ పేజ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

మోహ‌న్ లాల్ డ్యాన్స్ వీడియో చూసిన షారుఖ్ ఖాన్ స్పందించారు. ‘ఈ పాటకు స్టెప్పులేసి నాకు ప్రత్యేకంగా నిలిపిన మోహన్‌ లాల్‌ సర్‌కు థ్యాంక్స్‌. మీరు చేసిన దాంట్లో నేను సగమే చేశాను అని అనుకుంటున్నా. లవ్‌ యూ సర్‌. మీతో కలిసి డిన్నర్‌ చేసేందుకు వేచి చూస్తున్నా’ అని షారుఖ్ భాయ్ ట్వీట్ చేశారు. 

దీనికి మోహన్ లాల్ స్పందిస్తూ..‘డియర్‌ షారుక్‌.. మీలా ఎవరూ చేయలేరు. డ్యాన్స్‌లో మీది ప్రత్యేకమైన శైలి. మీ ప్రశంసలకు థ్యాంక్స్‌. కేవలం డిన్నరేనా..మనమెందుకు కలిసి జిందా బందాకు డ్యాన్స్‌ చేయకూడదు’ అని షారుక్‌ ఖాన్ ట్వీట్‌కు తనదైన శైలిలో మోహన్‌ లాల్‌ రిప్లై ఇచ్చారు. ‘ఓకే సర్‌..డాన్స్ మీ ఇంట్లోనా? లేదా మా ఇంట్లో చేద్దామా’ అంటూ షారుక్‌ మరో ట్వీట్‌ చేస్తూ సూపర్బ్ థ్రిల్ ఇచ్చారు ఆడియన్స్ కు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.