అక్టోబర్ లాస్ట్ వీక్.. OTTలో వచ్చే సినిమాలు ఇవే..ఆస్కార్‌ రేసులోని మూవీ కూడా!

అక్టోబర్ లాస్ట్ వీక్.. OTTలో వచ్చే సినిమాలు ఇవే..ఆస్కార్‌ రేసులోని మూవీ కూడా!

భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ప్రతి  సినిమా..ఆడియాన్స్ ను అంతగా ఆకట్టుకోకపోవొచ్చు. కొన్నిసార్లు ఆ అంచనాలు తలక్రిందులు అవుతుంటాయి. కానీ. కొన్ని సినిమాలు థియేటర్స్ లో సరిగా ఆడకున్నా..ఓటీటీ లో దుమ్ము రేపుతాయి. ఈ వ్యత్యాసం సినిమాలో ఉన్న కంటెంట్ తొందరగా..రీచ్ అవ్వకపోవడం వల్లనో..లేక ఇంట్లో సరదాగా చూస్తూ ఉండటం వల్లనో ఏమో! బాగా ఆడేస్తుంటాయి. మరి ఈ అక్టోబర్ లాస్ట్ వీక్ లో..OTTలో వచ్చే సినిమాలు ఏంటనేవి..ఓ లుక్కేద్దాం. 

1. ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 8

సినీ రంగ ప్రముఖులతో నిర్వహించే ప్రఖ్యాత టాక్​ షో కాఫీ విత్ కరణ్. ఈ స్పైసియెస్ట్ టాక్ షో ఎడవ సీజన్ కంప్లీట్ చేసుకుని..త్వరలో ఎనిమిదవ సీజన్‌కు రెడీ అవుతుంది. ఈ సారి  చాలా వింతగా, క్రేజీగా, నిష్కపటంగా ఈ సీజన్ ఉంటుందని తెలిపారు కరణ్. ఈ సీజన్‌లో, సెలబ్రేటిస్ పెళ్లిళ్లు, ఎయిర్‌పోర్ట్ లుక్‌లు, సోషల్ మీడియా వైరల్ వంటివి చూపించడానికి రెడీ అయ్యారు. ఫస్ట్ ఎపిసోడ్‌లో స్టార్ జంట రణవీర్ సింగ్ మరియు దీపికా పదుకొణె పాల్గొంటారు. ఇవాళ గురువారం (అక్టోబర్ 26న) డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. 

IMDb లో ఏడు సీజన్లలో అత్యధికంగా రేటింగ్ పొందిన షో గా కాఫీ విత్ కరణ్ నిలిచింది. 

2. ‘చంద్రముఖి 2’

లేటెస్ట్ తమిళ హార్రర్ చిత్రం ‘చంద్రముఖి 2’ పి. వాసు డైరెక్ట్ చేయగా..ప్రముఖ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. 2005లో వచ్చిన రజినీకాంత్ ‘చంద్రముఖి’ చిత్రానికి ఇది సీక్వెల్‌ గా తెరకెక్కింది. ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ ద్విపాత్రాభినయంతో పాటు కంగనా రనౌత్, లక్ష్మీ మీనన్ కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ గత నెల సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల కాగా ఇప్పుడు అక్టోబర్ 26 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రసారం కానుంది. 

3. గాడ్ 

జయం రవితో కలిసి నయనతార నటించిన సైకలాజికల్​ క్రైమ్​ థ్రిల్లర్​ గాడ్ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. తమిళంలో ఇరైవన్​, తెలుగులో ‘గాడ్’​ పేరుతో ఈ మూవీ విడుదలైంది. ఐ అహ్మద్​ దీనికి దర్శకుడు. సెప్టెంబర్​లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద ఆశించిన రిజల్ట్​ అందుకోలేకపోయింది.

ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​లో గాడ్​ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల అక్టోబర్ 26న హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లో ఈ మూవీ రిలీజ్​ కానుంది. నెట్​ఫ్లిక్స్​ లో స్ట్రీమింగ్ కానుంది. 

4. ‘ఎ హాంటింగ్ ఇన్ వెనిస్’

ఇది 1969 అగాథా క్రిస్టీ నవల "హాలోవీన్ పార్టీ" ఆధారంగా కెన్నెత్ బ్రనాగ్ నిర్మించి మరియు దర్శకత్వం వహించిన అమెరికన్ మిస్టరీ చిత్రం.ఎంతోగాను ఆకట్టుకున్న ఈ మూవీలో కైల్ అలెన్, కామిల్లె కాటిన్, జామీ డోర్నన్, టీనా ఫే, జూడ్ హిల్, అలీ ఖాన్, ఎమ్మా లైర్డ్, కెల్లీ రీల్లీ, రికార్డో స్కామార్సియో మరియు మిచెల్ యోహ్ నటించారు. ఈ మూవీ అక్టోబర్ 31 నుండి Disney+Hotstarలో స్ట్రీమింగ్ కానుంది.

5. ‘కూజంగల్’

 పి.ఎస్. వినోదరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కింన తమిళ చిత్రం ‘కూజంగల. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విఘ్నేష్ శివన్, నయనతార ఈ చిత్రాన్ని నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో చెల్లపాండి మరియు కరుత్తడయాన్ నటించారు. ఇది అక్టోబర్ 27 నుండి సోనీలివ్‌లో ప్రసారం కానుంది.

ALSO READ :- బీఆర్ఎస్కు కూచుకుళ్ల రాజీనామా.. సీఎం కేసీఆర్కు లేఖ

‘కూజాంగల్’ అస్కార్ అవార్డుకు ఎంపికయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 మంది సభ్యుల జ్యూరీ మన దేశం నుంచి ఆస్కార్‌ నామినేషన్‌కు వెళ్లే మొత్తం 14 సినిమాలను వీక్షించి అందులో ‘కూజాంగల్’ సినిమాను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.