ఆడుతూ పాడుతూ..కోల్ కతాపై ముంబై గ్రాండ్ విక్టరీ

ఆడుతూ పాడుతూ..కోల్ కతాపై ముంబై గ్రాండ్ విక్టరీ

గతానికి భిన్నంగా ఐపీఎల్‌‌‌‌ పదమూడో సీజన్‌‌‌‌లో స్టార్టింగ్‌‌‌‌ నుంచే దుమ్మురేపుతున్న ముంబై ఇండియన్స్‌‌‌‌కు ఎదురేలేకుండా పోయింది. అరబ్‌‌‌‌ గడ్డపై అదిరిపోయే పెర్ఫామెన్స్‌‌‌‌ చేస్తోంది. మరోసారి ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షో చేసిన ఇండియన్స్‌‌‌‌.. కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌ రైడర్స్‌‌‌‌ను చిత్తుగా ఓడించింది. తొలుత బౌలింగ్‌‌‌‌లో పంజా విసిరి ఆ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ముంబై తర్వాత  క్వింటన్‌‌‌‌ డికాక్‌‌‌‌  (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 78 నాటౌట్‌‌‌‌) మెరుపు బ్యాటింగ్‌‌‌‌తో చిన్న టార్గెట్‌‌‌‌ను ఆడుతూ పాడుతూ ఛేజ్‌‌‌‌ చేసింది. లీగ్​లో ఆరో విక్టరీతో  టేబుల్‌‌‌‌లో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు వచ్చేసింది. మరోవైపు కెప్టెన్‌‌‌‌ మారినా కోల్‌‌‌‌కతా ఆటలో అంతగా మార్పు కనిపించలేదు. టాప్‌‌‌‌, మిడిలార్డర్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ చేతులెత్తేయడంతో ఇయాన్‌‌‌‌ మోర్గాన్‌‌‌‌ కెప్టెన్సీ ఓటమితో మొదలైంది.  ఆ జట్టు ఖాతాలో నాలుగో పరాజయం చేరింది.

అబుదాబిఐపీఎల్‌‌‌‌13లో కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌ రైడర్స్‌‌‌‌ ఓ అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి వేస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌‌‌‌లోనూ బ్యాటింగ్‌‌‌‌ ఫెయిల్యూర్‌‌‌‌తో నిరాశ పరిచింది. బౌలింగ్‌‌‌‌లోనూ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో శుక్రవారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 8  వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌‌‌‌ చేతిలో చిత్తయింది. తొలుత  కోల్‌‌‌‌కతా  20 ఓవర్లలో 5 వికెట్లకు 148 రన్స్‌‌‌‌ చేసింది. పేసర్ ప్యాట్‌‌‌‌ కమిన్స్‌‌‌‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 నాటౌట్‌‌‌‌) మెరుపు ఫిఫ్టీతో అదరగొట్టగా.. కెప్టెన్సీ అందుకున్న ఇయాన్‌‌‌‌ మోర్గాన్‌‌‌‌ (29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 నాటౌట్‌‌‌‌) రాణించాడు. . రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌ (2/18) రెండు వికెట్లు తీసి పొదుపుగా బౌలింగ్‌‌‌‌ చేశాడు. అనంతరం డికాక్‌‌‌‌ మెరుపులతో  ముంబై  16.5 ఓవర్లలో 2 వికెట్లకు 149  రన్స్‌‌‌‌ చేసి ఈజీగా గెలిచింది. రోహిత్‌‌‌‌ శర్మ (36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌‌‌‌తో 35), హార్దిక్‌‌‌‌ పాండ్యా (11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌‌‌‌తో 21 నాటౌట్‌‌‌‌) కూడా రాణించారు. డికాక్‌‌‌‌కు మ్యాన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు దక్కింది.

వికెట్లు టపటపా

టాస్‌‌‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన కోల్‌‌‌‌కతా ఇన్నింగ్స్‌‌‌‌కు ఆరంభంలోనే  దెబ్బ మీద దెబ్బ తగిలింది. ముంబై బౌలింగ్‌‌‌‌ ధాటికి కేకేఆర్‌‌‌‌ టాప్‌‌‌‌, మిడిలార్డర్‌‌‌‌ చేతులెత్తేసింది. చప్పగా మొదలైన ఇన్నింగ్స్‌‌‌‌కు మూడో ఓవర్లోనే షాక్‌‌‌‌ తగిలింది. బౌల్ట్‌‌‌‌ (1/32)బౌలింగ్‌‌‌‌లో పాయింట్‌‌‌‌ వద్ద సూర్యకుమార్‌‌‌‌ పట్టిన స్టన్నింగ్‌‌‌‌ క్యాచ్‌‌‌‌కు ఓపెనర్‌‌‌‌ రాహుల్‌‌‌‌ త్రిపాఠి (7) వెనుదిరిగాడు. ప్యాటిన్సన్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో టీమ్‌‌‌‌లోకి వచ్చిన నేథన్‌‌‌‌ కూల్టర్‌‌‌‌నైల్‌‌‌‌ (1/51)ఆరో ఓవర్లో ఓ షార్ట్‌‌‌‌ డెలివరీతో నితీశ్‌‌‌‌ రాణా (5)ను ఔట్‌‌‌‌ చేసి కేకేఆర్‌‌‌‌ను మరో దెబ్బకొట్టాడు. ఇక ఎనిమిదో ఓవర్లో స్పిన్నర్‌‌‌‌ రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌  డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చాడు. రెండు ఫోర్లు కొట్టి ఊపుమీదున్న శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (23 బంతుల్లో 21)తో పాటు  దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ (4)ను వరుస బాల్స్‌‌‌‌లో వెనక్కుపంపాడు. దాంతో, 42/4తో కష్టాల్లో పడ్డ జట్టును కొత్త  కెప్టెన్‌‌‌‌ మోర్గాన్‌‌‌‌, ఆండ్రీ రసెల్‌‌‌‌ (12) ఆదుకునే ప్రయత్నం చేశారు. క్రునాల్‌‌‌‌ పాండ్యా  (0/23)బౌలింగ్‌‌‌‌లో భారీ సిక్సర్‌‌‌‌ బాదిన ఆండ్రీ ఇన్నింగ్స్‌‌‌‌కు వేగం తీసుకురాగా.. చహర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లోనే మోర్గాన్‌‌‌‌ బౌండ్రీ కొట్టడంతో పది ఓవర్లకు కేకేఆర్‌‌‌‌ 57/4తో నిలిచింది. ఆపై, బుమ్రా (1/22) బౌలింగ్‌‌‌‌లో పవర్‌‌‌‌ ఫుల్‌‌‌‌షాట్‌‌‌‌తో ఫోర్‌‌‌‌ కొట్టిన రసెల్‌‌‌‌ ఊపు మీద కనిపించాడు. కానీ, వెంటనే షార్ప్‌‌‌‌ బౌన్సర్ తో బుమ్రా అతడిని ఔట్​ చేసి రివెంజ్​ తీర్చుకున్నాడు.

కమిన్స్‌‌‌‌ కమాల్‌‌‌‌

అప్పటికే ఐదు వికెట్లు పడడం, చహర్‌‌‌‌, క్రునాల్‌‌‌‌ పొదుపుగా బౌలింగ్‌‌‌‌ చేయడంతో కోల్‌‌‌‌కతా ఇన్నింగ్స్‌‌‌‌ నత్తనడకను తలపించింది. తొలుత మోర్గాన్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌కే పరిమితం కావడంతో 12వ ఓవర్లకు 66/5తో నిలిచిన ఆ టీమ్‌‌‌‌ 130 చేస్తే గొప్పే అనిపించింది. కానీ, ఏడో నంబర్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన కమిన్స్‌‌‌‌ మాయ చేశాడు. స్లాగ్‌‌‌‌ ఓవర్లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 13వ ఓవర్లో  సెకండ్‌‌‌‌ స్పెల్‌‌‌‌కు వచ్చిన కూల్టర్‌‌‌‌నైల్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో అతను రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌‌‌‌ కొట్టిన కమిన్స్‌‌‌‌ 16 రన్స్‌‌‌‌ రాబట్టడంతో  ఇన్నింగ్స్‌‌‌‌కు మళ్లీ ఊపొచ్చింది. తర్వాతి మూడు ఓవర్లలో ఒక్క బౌండ్రీ రాకున్నా.. బౌల్ట్‌‌‌‌ వేసిన 17వ ఓవర్లో మోర్గాన్‌‌‌‌, కమిన్స్‌‌‌‌ చెరో ఫోర్‌‌‌‌ బాది స్కోరు వంద దాటించారు.  బుమ్రా బౌలింగ్‌‌‌‌లో కమిన్స్‌‌‌‌ ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను కీపర్‌‌‌‌ డికాక్‌‌‌‌ డ్రాప్‌‌‌‌ చేశాడు. ఈ చాన్స్‌‌‌‌ను సద్వినియోగం చేసుకున్న కమిన్స్‌‌‌‌.. కూల్టర్‌‌‌‌నైల్‌‌‌‌ వేసిన లాస్ట్‌‌‌‌ ఓవర్ ఫస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌నే బౌండ్రీకి చేర్చి 35 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆపై, థర్డ్‌‌‌‌, లాస్ట్‌‌‌‌ బాల్స్‌‌‌‌ను సిక్సర్లుగా మలచిన మోర్గాన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌కు ఫినిషింగ్‌‌‌‌ టచ్‌‌‌‌ ఇచ్చాడు. కమిన్స్‌‌‌‌, మోర్గాన్‌‌‌‌ ఆరో వికెట్‌‌‌‌కు 56 బాల్స్‌‌‌‌లోనే 87 రన్స్‌‌‌‌ జోడించడంతో కేకేఆర్‌‌‌‌ 150 మార్కుకు చేరువగా రాగలిగింది.

డికాక్ ధనాధన్

చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో ముంబైకి ఓపెనర్లు డికాక్‌‌‌‌, రోహిత్‌‌‌‌ మెరుపు ఆరంభం ఇచ్చారు. పవర్‌‌‌‌ ప్లేలో  పోటాపోటీగా బౌండ్రీలు కొట్టడంతో ముంబై  ఇన్నింగ్స్‌‌‌‌ పది రన్‌‌‌‌రేట్‌‌‌‌తో దూసుకెళ్లింది. అరంగేట్రం స్పిన్నర్‌‌‌‌ క్రిస్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ (0/24) తో మోర్గాన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ ఆరంభించగా.. ఫస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కే  ఫోర్‌‌‌‌తో రోహిత్‌‌‌‌ అతనికి వెల్‌‌‌‌కమ్‌‌‌‌ చెప్పాడు. ఆపై, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ (0/30) బౌలింగ్‌‌‌‌లో వరుసగా రెండు బౌండ్రీలు రాబట్టాడు. అక్కడి నుంచి డికాక్‌‌‌‌ మోత మొదలైంది.  కమిన్స్‌‌‌‌ (0/28), గ్రీన్‌‌‌‌ ఓవర్లలో అతను  రెండేసి బౌండ్రీలు రాబట్టాడు. ఓ టఫ్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ను వరుణ్‌‌‌‌ డ్రాప్‌‌‌‌ చేయడంతో క్వింటన్‌‌‌‌కు లైఫ్‌‌‌‌ వచ్చింది. ఈ చాన్స్‌‌‌‌ను యూజ్‌‌‌‌ చేసుకున్న డికాక్‌‌‌‌.. ప్రసిధ్‌‌‌‌ వేసిన 8వ ఓవర్లో 4,6,4తో మరింత రెచ్చిపోయాడు. రోహిత్‌‌‌‌ నెమ్మదించినా సఫారీ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ మాత్రం అదే ఊపు కొనసాగించాడు. రసెల్‌‌‌‌ (0/15) బౌలింగ్‌‌‌‌లో 4, 6 కొట్టి 24 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఇక, వరుణ్‌‌‌‌ చక్రవర్తి (1/23) వేసిన పదో ఓవర్లో తన మార్కు పుల్‌‌‌‌షాట్‌‌‌‌తో సిక్సర్‌‌‌‌, శివమ్‌‌‌‌ మావి (1/24) బౌలింగ్‌‌‌‌లో మరో ఫోర్‌‌‌‌ రాబట్టిన హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ మళ్లీ గేరు మార్చాడు. కానీ, ఇంకో షాట్‌‌‌‌ ఆడే ప్రయత్నంలో కీపర్‌‌‌‌కు చిక్కడంతో ఫస్ట్​ వికెట్​కు​ 94 రన్స్​ పార్ట్​నర్​షిప్​ బ్రేక్​ అయింది. ఈ టైమ్‌‌‌‌లో డికాక్‌‌‌‌తో పాటు సూర్య కుమార్‌‌‌‌ (10)కాస్త నెమ్మదిగా ఆడారు. ఫామ్‌‌‌‌లో ఉన్న  సూర్యను 14వ ఓవర్లో వరుణ్‌‌‌‌ చక్రవర్తి క్లీన్‌‌‌‌బౌల్డ్‌‌‌‌ చేసి కేకేఆర్‌‌‌‌కు మరో బ్రేక్‌‌‌‌ ఇచ్చాడు.  కానీ, శివమ్‌‌‌‌ మావి వేసిన తర్వాతి ఓవర్లో 4, 6తో డికాక్‌‌‌‌ మళ్లీ స్పీడు పెంచాడు. నాలుగో నంబర్‌‌‌‌లో వచ్చిన హార్దిక్‌‌‌‌ పాండ్యా.. కమిన్స్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో4,4,6తో రెచ్చిపోవడంతో ముంబై ఈజీగా లక్ష్యాన్ని చేరుకుంది.

కోల్‌‌‌‌కతా: త్రిపాఠి (సి) సూర్యకుమార్‌‌‌‌ (బి) బౌల్ట్‌‌‌‌ 7, గిల్‌‌‌‌(సి) పొలార్డ్‌‌‌‌ (బి) చహర్‌‌‌‌ 21, రాణా (సి) డికాక్‌‌‌‌ (బి) కూల్టర్‌‌‌‌నైల్‌‌‌‌ 5, కార్తీక్‌‌‌‌ (బి) చహర్‌‌‌‌ 4, మోర్గాన్‌‌‌‌ (నాటౌట్‌‌‌‌) 39, రసెల్‌‌‌‌ (సి) డికాక్‌‌‌‌ (బి) బౌల్ట్‌‌‌‌ 12, కమిన్స్‌‌‌‌  (నాటౌట్‌‌‌‌) 53; ఎక్స్‌‌‌‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 148/5;  వికెట్ల పతనం: 1–18, 2–33, 3–42, 4–42, 5–61;  బౌలింగ్‌‌‌‌: బౌల్ట్‌‌‌‌ 4–0–32–1, కూల్టర్‌‌‌‌నైల్‌‌‌‌ 4–0–51–1, బుమ్రా 4–0–22–1, క్రునాల్‌‌‌‌ 4–0–23–0, చహర్‌‌‌‌ 4–0–18–2.

ముంబై: రోహిత్‌‌‌‌ (సి) కార్తీక్‌‌‌‌ (బి) మావి 35, డికాక్‌‌‌‌ (నాటౌట్) 78, సూర్యకుమార్‌‌‌‌ (బి) చక్రవర్తి 10, హార్దిక్‌‌‌‌ (నాటౌట్‌‌‌‌) 21; ఎక్స్‌‌‌‌ట్రాలు: 16.5 ఓవర్లలో 149/2; వికెట్ల పతనం: 1–94, 2–111; బౌలింగ్‌‌‌‌: గ్రీన్‌‌‌‌ 2.5–0–24–0, కమిన్స్‌‌‌‌  3–0–28–0, ప్రసిధ్‌‌‌‌ 2–0–30–0, రసెల్‌‌‌‌ 2–0–15–0, చక్రవర్తి 4–0–23–1, శివమ్‌‌‌‌ మావి 3–0–24–1.