పాక్ ను వెనకేసుకొచ్చిన సిద్దూ : కపిల్ శర్మ షో నుంచి ఔట్

పాక్ ను వెనకేసుకొచ్చిన సిద్దూ : కపిల్ శర్మ షో నుంచి ఔట్

కపిల్ శర్మ షో నుంచి పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ లీడర్ నవజ్యోత్ సింగ్ సిద్దును తప్పించారు షో నిర్వాహకులు. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో పాకిస్తాన్ ను తప్పుపట్టాల్సిన పనిలేదని సిద్దు అన్నందుకు ఆయనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తాయి. దీంతో సిద్దు స్థానంలో అర్చన పురాణ్ సింగ్ ను రిప్లేస్ చేసినట్టు సమాచారం. సిద్దు కామెంట్స్ వల్ల  షో కు చెడ్డపేరు రాకూడదనే.. ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది.

పంజాబ్ మంత్రి సిద్దు గురువారం పుల్వామా ఉగ్రదాడి పై మాట్లాడుతూ… దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఇది పిరికి పంద చర్యగా అభివర్ణస్తూనే.. పాకిస్తాన్ ను తప్పుపట్ట వద్దని కోరారు. దీంతో సిద్దుపై సోషల్ మీడియాలో తీవ్రవిమర్షలు వెళ్లువెత్తాయి. దీంతో పాటే..  సిద్దు గెస్ట్ గా ఉన్న షో నుండి తొలగించాలని కోరారు నెటిజన్లు. ఇదివరకే సిద్దు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను కౌగిలించుకుని విమర్శలపాలయ్యారు.

యుద్ధ సమయంలో కాకుంగా.. ఎక్కువ మంది సైనికులు అమరులవడం ఇదే తొలిసారి. దీంతో ఇటు దేశ ప్రజలు.. అటు ఆర్మీ ఆగ్రహంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా.. ఎదురు దాడిచేయాలని.. వ్యూహాన్ని తెలుపాలని ఆర్మీకి చెప్పింది. ఇటువంటి సమయంలో పంజాబ్ మంత్రి సిద్దు పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడటంతో తీవ్ర విమర్శల పాలయ్యారు. చివరికి.. ఆయన గెస్ట్ గా ఉన్న షో నుంచి తప్పించబడ్డారు. https://twitter.com/ani_digital/status/1096729720694210560