పోలవరం కాపర్ డ్యాం ముంపుపై చర్యలను ప్రశ్నించిన ఎన్జీటీ

పోలవరం కాపర్ డ్యాం ముంపుపై చర్యలను ప్రశ్నించిన ఎన్జీటీ

పోలవరం, పురుషోత్తమపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులపై ఎన్జీటీలో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టిన ఏ ఒక్క అధికారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఎన్జీటీ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ చట్టాన్ని ఏపీలో తీవ్రంగా ఉల్లంఘించడం సిగ్గుచేటని కామెంట్ చేసింది ఎన్జీటీ. పోలవరం కాఫర్ డ్యామ్  వల్ల ముంపు జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. పోలవరం ముంపుపై ఎందుకింత నిర్లక్షం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు ముగించాలన్న ఆతృత మాత్రమే కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి నివేదికలో కనిపించిందని తెలిపింది ఎన్జీటీ.