నిర్భయ దోషుల ఉరితీత ఆలస్యంతో తప్పుడు సంకేతాలు

నిర్భయ దోషుల ఉరితీత ఆలస్యంతో తప్పుడు సంకేతాలు

నిర్భయ దోషులను ఉరితీసే విషయంలో జరుగుతున్న ఆలస్యంపై ఆమె తల్లి ఆశాదేవి అసంతృప్తి వ్యక్తం చేశారు. దోషుల ఉరితీత అమలు వారెంట్ల విషయంలో ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. దోషులను ఉరితీసేంత వరకూ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు ఆశాదేవి.

నిర్భయ కేసులో దోషుల ఉరితీత విషయంలో జరుగుతున్న ఆలస్యంపై ఆమె తండ్రి బద్రీనాథ్ కూడా విచారం వ్యక్తం చేశారు. అంతేకాదు దోషుల తరఫు లాయరు సిగ్గుపడాలన్నారు. రాష్ట్రపతి ఆదేశాలను పరిహాసం చేస్తున్నారని తెలిపారు.