
పచ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గవర్నర్ పౌరులకు చూపించిన వీడియోలు ఎడిటెడ్ అని తన వద్ద ఒరిజినల్ వీడియోస్ ఉన్నాయన్నారు మమత. శనివారం హుగ్లీలో జరిగిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. తాను గవర్నర్ ఫుటేజ్ మొత్తం చూశానని.. అందులో దిగ్ర్బాంతికి గురిచేసే దృశ్యాలున్నాయంటూ మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు.
దీంతో పాటుగా మరికొన్ని వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ తన దగ్గర ఉందన్నారు. గవర్నర్ గా సివి ఆనంద బోస్ రాజీనామా చేసే వరకు రాజ్ భవన్ కు వెళ్లేది లేదని మమత తేల్చి చెప్పారు. . గవర్నర్‌ను కలవాలంటే బహిరంగ ప్రదేశంలో కలుస్తానన్నారు. కాగా గవర్నర్ సివి ఆనంద బోస్ తనను లైంగిక వేధించారంటూ ఇటీవల రాజ్ భవన్ ఉద్యోగి ఆరోపించిన సంగతి తెలిసిందే.
రాజ్‌భవన్‌లోని సీసీటీవీ ఫుటేజీని కోరామని, కొంతమంది రాజ్‌భవన్ సిబ్బందితో మాట్లాడాలని కూడా యోచిస్తున్నామని పోలీసులు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ ఈ విషయంపై సోషల్ మీడియాలో తన ఆందోళనలను వ్యక్తం చేసింది, ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరింది