కాలేజీకి బుర్ఖాతో వస్తే జరిమానా

కాలేజీకి బుర్ఖాతో వస్తే జరిమానా

బుర్ఖా వేసుకుని వస్తే జరిమానా విధిస్తామంటూ ఓ కాలేజీ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా యాజమాన్యం పెట్టిన డ్రస్‌ కోడ్‌తోనే రావాలని ఆదేశించింది. దాన్ని ఉల్లంఘిస్తే రూ.250 ఫైన్ వసూలు చేస్తామని హెచ్చరించింది. బిహార్ రాజధాని పాట్నాలోని జేడీ ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్యామ రాయ్ ఈ నోటీసు జారీ చేశారు.

ప్రతి విద్యార్థి కాలేజీ పెట్టిన కొత్త డ్రస్ కోడ్ పాటించాలని సర్క్యులర్‌లో ఆదేశించారు. అయితే ఆ డ్రస్ కోడ్ ఏంటన్నది క్లారిటీ అందులో లేదు. శనివారం ఒక్క రోజు మాత్రం విద్యార్థినులు వారికి నచ్చిన డ్రస్ వేసుకోవచ్చని తెలిపింది కాలేజీ యాజమాన్యం. అయితే కాలేజీ లోపల విద్యార్థినులెవరూ బుర్ఖా ధరించడానికి లేదని సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నిబంధనల్లో దేన్ని ఉల్లంఘించినా రూ.250 ఫైన్ వసూలు చేస్తామని హెచ్చరించింది.

కాలేజీ యాజమాన్యం పెట్టిన డ్రస్ కోడ్ నిబంధనలపై శనివారం విద్యార్థినులంతా నిరసనకు దిగారు. సర్క్యులర్‌ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే బుర్ఖా ధరించకూడదన్న నిబంధనను మాత్రం తొలగించాలని కాలేజీ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

No burqa allowed, Patna college tells Muslim students; imposes Rs 250 fine for violation