నోట్లో నోరు పెట్టి కోతికి ఊపిరి

నోట్లో నోరు పెట్టి కోతికి ఊపిరి

మానవత్వం బతికే ఉందని నిరూపించాడో వ్యక్తి. కుక్కల దాడిలో స్పృహ తప్పిపోయిన ఓ కోతిని కాపాడాడు తమిళనాడుకు చెందిన వ్యక్తి.  కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మంకీ హార్ట్ బీట్ ఆగిపోవడంతో దాని చాతీపై గట్టిగా నొక్కాడు. అయినా ఫలితం లేకపోవడంతో నోటితో ఆ మంకీకి శ్వాస అందించాడు. కోతి స్పృహలోకి రాగానే ఆనందంతో గుండెలకు హత్తుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను క్రికెటర్ అశ్విన్ షేర్ చేశాడు. ఆశ ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోకు నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. మానవత్వం ఇంకా బతికే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.