మలైకా 'యస్' చెప్పింది అందుకు కాదట.. !

మలైకా 'యస్' చెప్పింది అందుకు కాదట.. !

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా, యంగ్ అండ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ తో గత కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతుంది. అయితే ఇటీవల మలైకా తన ఇన్‌స్టాగ్రామ్ లో 'I Said Yes' అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో అర్జున్ కపూర్ మ్యారేజ్ ప్రపోజల్ కి మలైకా ఓకే చెప్పేసిందని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అందరూ అనుకున్నట్టు తాను ఓకే చెప్పింది దానికి కాదంటూ అందరికీ షాక్ ఇచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్టార్ట్ అయ్యే న్యూ రియాలిటీ షో ‘మూవింగ్ విత్ మలైకా’ కోసమని తాజాగా మలైకా సోషల్ మీడియాలో వెల్లడించింది. 

ఇక 49ఏళ్ల ఈ బ్యూటీ, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉంది. దాదాపు 12ఏళ్ల డిఫరెన్స్ ఉన్న వీరిద్దరూ గత 4ఏళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. అయితే ఇటీవల మలైకా తన ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ తో అందరూ అర్జున్ కపూర్ తో మ్యారేజ్ కి ఓకే చెప్పిందనుకున్నారు. కానీ అది నిజం కాదని ఈ బామ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా మలైకాకి ఆల్రెడీ పెళ్లి అయ్యి, 2017లో విడాకులు కూడా అయ్యాయి. అంతేకాదు ఈమెకు 20 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు.