Kantara Chapter 1: బాక్సాఫిస్ బద్దలయ్యే అప్డేట్.. కాంతారా చాప్టర్ 1లో ఎన్టీఆర్

Kantara Chapter 1: బాక్సాఫిస్ బద్దలయ్యే అప్డేట్.. కాంతారా చాప్టర్ 1లో ఎన్టీఆర్

అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచినా సినిమా కాంతారా(Kantara). కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఇక తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తమ సొంత సినిమాగా ఆదరించారు. నటుడు రిషబ్ శెట్టి(Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పుడు ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాంతార: చాప్టర్ 1పేరుతో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన అనౌన్సమెంట్ వీడియో ఆ అంచనాలని మరింత పెంచేసింది. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

తాజాగా అలాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడట. ఇటీవల ఓ కార్యక్రమం కోసం కర్ణాటకకు వెళ్లిన ఎన్టీఆర్.. అక్కడ రిషబ్ శెట్టిని కలిశారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ సమయం లోనే కాంతారాలో ముఖ్యమైన పాత్ర కోసం ఎన్టీఆర్ ను అడిగాడట రిషబ్ శెట్టి. ఆ పాత్ర నచ్చడంతో ఎన్టీఆర్ కూడా వెంటనే ఒకే చేశాడని సమాచారం. త్వరలోనే ఈ న్యూస్ పై అధికారిక ప్రకటన రానుందట. 

ALSO READ :- Nayanthara, Vignesh shivan: విడాకుల న్యూస్ వైరల్.. ఫోటోతో క్లారిటీ ఇచ్చిన నయన్

నిజంగా ఈ సినిమాకు గనక ఎన్టీఆర్ ఓకే చెప్తే.. కాంతార సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం. ఈ న్యూస్ తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. కాంతారా లాంటి గొప్ప సినిమాలో తమ హీరోకు స్థానం కలిపిస్తున్నదుకు రిషబ్ శెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.