కామారెడ్డి జిల్లాలో ఒకరికి కరోనా.. వెయ్యికి పైన ఇళ్లల్లో అధికారుల స‌ర్వే

కామారెడ్డి జిల్లాలో ఒకరికి కరోనా.. వెయ్యికి పైన ఇళ్లల్లో అధికారుల స‌ర్వే

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో కరోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. కాల‌నీలో నివాసం ఉండే ఓ వృద్ధుడి(60)కి కరోనా పాజిటివ్ గా తేలడంతో అధికారులు గురువారం అత‌న్ని హైదరాబాద్‌లోని గాంధీ హస్పిటల్ కి త‌ర‌లించారు. అత‌డి కుటుంబీకులు 13 మందిని హోం క్వారంటైన్లో ఉంచారు.వైర‌స్ మ‌రెవ‌రికైనా సోకింద‌న్న అనుమానంతో శుక్రవారం పంచముఖి హనుమాన్ కాలనీలోని 1,440 ఇళ్లలో అధికారులు 18 టీమ్స్ ఆధ్వర్యంలో సర్వే చేపట్టనున్నారు.

బీబీపేట మండలంలోని తుజాల్పూర్, మల్కాపూర్ గ్రామాలలో 11 కుటుంబాలను కూడా అధికారులు హోం క్వారంటైన్ చేశారు. తుజాల్పూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. మే 30న సొంతూరికి వచ్చి రెండు రోజులు అక్క‌డే ఉన్న ఆ వ్య‌క్తి.. అస్వస్థత చెందడంతో స్థానిక పీఎంపీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని మరుసటి రోజు రాజధానికి వెళ్లాడు. అక్కడ వెళ్లిన తర్వాత బుధవారం ‌కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో గ్రామానికి వచ్చినప్పుడు కలిసిన వారిని అధికారులు హోం క్వారంటైన్ చేశారు.