SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ

SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ

ఐపీఎల్ లో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఓడిపోతే మ్యాచ్ లో రాజస్థాన్ పై అద్భుత విజయాన్ని సాధించింది. కెప్టెన్ కమ్మిన్స్, భువనేశ్వర్ అద్భుత బౌలింగ్ తో చివరి బంతికి గెలిచి ఊపిరి పీల్చుకుంది. చివరి రెండు ఓవర్లలో రాజస్థాన్ విజయానికి 20 పరుగులు కావాల్సిన దశలో 19 ఓవర్ లో కమ్మిన్స్ 7 పరుగులే ఇవ్వడం.. చివరి ఓవర్ లో భువీ 11 పరుగులే ఇచ్చి సన్ రైజర్స్ కు మర్చిపోలేని విజయాన్ని అందించారు.    

పరాగ్( 49 బంతుల్లో 77,8 ఫోర్లు, 4 సిక్సులు) జైస్వాల్(40 బంతుల్లో 67, 7 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపులతో రాజస్థాన్ గెలుపు దిశగా నడిచినా.. ఒత్తిడిని జయించలేక చివర్లో చేతులెత్తేసింది. ఈ విజయంతో 10 మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ 6 విజయాలను తన ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్ రేస్ లో ముందడుగు వేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లో 200 పరుగులు చేసి ఓడింది.  

202 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ కు తొలి ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ బట్లర్, కెప్టెన్ సంజు శాంసన్ తొలి ఓవర్ లోనే డకౌటయ్యారు. దీంతో 1 పరుగుకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ ఎదురు దాడికి దిగారు. సన్ రైజర్స్ బౌలర్లను చితక్కొడుతూ స్కోర్ బోర్డ్ ను పరుగులెత్తించారు.

మూడో వికెట్ కు భారీ భాగస్వామ్యం నెలకొల్పి విజయం దిశగా తీసుకెళ్లారు. అయితే స్వల్ప వ్యవధిలో జైస్వాల్, పరాగ్, హెట్ మేయర్(13) ఔట్ కావడంతో మ్యాచ్ గెలిపించే బాధ్యత పావెల్ (27) మీద పడింది. మ్యాచ్ ను చివరి వరకు తీసుకెళ్లినా ఫినిష్ చేయలేకపోయాడు. దీంతో రాజస్థాన్ విజయానికి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయింది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీసుకున్నాడు. కమ్మిన్స్, నటరాజన్, కమ్మిన్స్ రెండు వికెట్లు పడగొట్టారు.    

అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి( 42 బంతుల్లో 72,3 ఫోర్లు, 8 సిక్సులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. హెడ్ (44 బంతుల్లో 58... 6 ఫోర్లు, 3 సిక్సులు) క్లాసన్ (19 బంతుల్లో 42, 3 ఫోర్లు, 3 సిక్సులు) రాణించారు.