Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా

Gold Rates :  తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి..  హైదరాబాద్లో ధరలు ఇలా

బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.  2024 మే 03వ తేదీ శుక్రవారం రోజున 22 క్యారెట్ల 10  గ్రాముల  బంగారం ధర రూ.  500 తగ్గి రూ. 65వేల 750కి చేరుకుంది. ఇక  24  క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.  540  తగ్గి రూ. 71 వేల 730కి చేరుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  65వేల 900గా ఉండగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  71వేల 880గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని మంబైలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  65 వేల 750గా ఉండగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  71వేల 730గా ఉంది. 

హైదరాబాద్ విషయానికి వస్తే  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  65 వేల 750గా ఉండగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  71వేల 730గా ఉంది. విశాఖపట్నంలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  65 వేల 750గా ఉండగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  71వేల 730గా ఉంది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 

ఇక వెండి ధరలు  స్థిరంగానే కొనసాగుతున్నాయి.  ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి రేటు ఎలాంటి మార్పు లేకుండా రూ. 87 వేల మార్క్ వద్ద ట్రేడింగ్ అవుతోంది. ముంబై, ఢిల్లీ, కోల్ కత్తాలో రూ.  83 వేల 500గా ఉన్నాయి.