Janhvi Kapoor Chennai Home: జాన్వీ కపూర్ ఇంట్లో ఉంటారా? ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే..వాటికి మాత్రమే యాక్సెస్

Janhvi Kapoor Chennai Home: జాన్వీ కపూర్ ఇంట్లో ఉంటారా? ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే..వాటికి మాత్రమే యాక్సెస్

అతిలోక సుందరి..అందాల తార..దివికన్య ఇలా..ఏ పేరుతో పిలిచినా సెట్ అయ్యేది కేవలం శ్రీదేవి(Sridevi)కి మాత్రమే.అలాంటి శ్రీదేవిని చూడకున్న, ఆమె నివసించిన ఇంట్లో ఉండటానికి అవకాశం కల్పిస్తోంది శ్రీదేవి అందాల కూతురు జాన్వీ. 

వివరాల్లోకి వెళితే..ప్రస్తుతం హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పేరు మీద ఉన్న చెన్నై ఇల్లును..తన తల్లి శ్రీదేవి అప్పట్లో ఇష్టంగా కొనుక్కుంది.ఇక ఆమె మరణించిన తర్వాత..ఆ ఇల్లు పూర్తిగా జాన్వీ సొంతమయ్యింది.తాజాగా ఈ విలాసవంతమైన ఇంటిని ఎయిర్ బీఎన్‌బీ(Airbnb)యాప్ తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయడంతో పాటు ఈ యాప్‌ను ఉపయోగించే యూజర్లకు ఆ ఇంట్లో ఉండే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది. 

‘బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్‌లాగా జీవించండి’ అంటూ తన ఇంటి ఫోటోలను పోస్ట్ చేసింది ఎయిర్ బీఎన్‌బీ యాప్‌.అలాగే 'బెడ్ రూమ్ చూడండి ఎంత అందంగా ఉందో..ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది అని జాన్వీ చెప్పినట్లుగా ఎయిర్‌బీఎన్‌బీ వెబ్ సైట్లో వెల్లడించింది.

అంతేకాకుండా డైనింగ్ హాల్,ఇంటి చుట్టూ పచ్చదనంతో ఉన్న ఏరియా,ఇక అందులోనే స్విమ్మింగ్ పుల్,ప్రతి రూమ్ నుంచి సన్ సెట్ రావడం ఇలా ప్రతిదీ చాలా అందాన్ని పెంచుతున్నాయి.ఇక డైనింగ్ టేబుల్ పక్కన గోడకు ఉన్న పెయింటింగ్ స్వయంగా శ్రీదేవి వేయడం..ఇలా ప్రతి ఒక్కటీ ఈ బ్యూటీఫుల్ హౌస్ పై ఆసక్తి పెంచుతున్నాయి.  

వాటికి మాత్రమే యాక్సెస్..

జాన్వీ కపూర్ ఇంట్లో ఉండడానికి ఎయిర్ బీఎన్‌బీ యాప్ కేవలం ఇద్దరు గెస్టులకు మాత్రమే ఆహ్వానం కల్పించింది . అంతేకాకుండా.. వారికి కేవలం ఒక బెడ్ రూమ్, ఒక బాత్ రూమ్‌లోకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. మే 12 నుంచి ఈ ఇంట్లో ఉండడానికి బుకింగ్స్ ఓపెన్ అవ్వనున్నాయని ఎయిర్ బీఎన్‌బీ ప్రకటించింది. 

అంతే కాకుండా బుకింగ్ చేసుకున్న వారిలో ఎవరు వచ్చి తన ఇంట్లో, తనతో పాటు ఉండగలరు అనే నిర్ణయాన్ని పూర్తిగా జాన్వీ కపూర్ డిసైడ్ చేస్తుందని తెలిపింది ఎయిర్ బీఎన్‌బీ. అయితే, తను ఎంపిక చేసిన గెస్టులకు సౌత్ ఇండియన్ స్టైల్‌లో లంచ్ ఉంటుందని, అందులో జాన్వీ ఫేవరెట్ అయిన నెయ్యి పొడి రైస్, పాలకోవా వంటి అరేంజ్ మెంట్స్ కూడా ఉంటాయని తెలిపింది.

ఎయిర్ బీఎన్‌బీలో జాన్వీ కపూర్ ఇంటిని బుక్ చేసుకున్న వారు..ఒక రాత్రి అక్కడే గడపొచ్చు.ఆ సమయంలో జాన్వీతో ముచ్చటించవచ్చు కూడా అని ఎయిర్ బీఎన్‌బీ క్లారిటీ ఇచ్చింది

అయితే నేటి రోజుల్లో ప్రతీ యాప్..తమకు వచ్చే కస్టమర్లను అట్రాక్ట్ చేయడం కోసం డిఫెరెంట్ ఐడియాలతో మార్కెట్లోకి వస్తున్నాయి. అలా ఇప్పుడు ఎయిర్ బీఎన్‌బీ తీసుకొచ్చిన ఈ కొత్త ప్రయోగం శ్రీదేవి ఇల్లు కావడం ఆసక్తికరంగా మారింది. అసలు ఎయిర్ బీఎన్‌బీ విషయానికి వస్తే..'మనం ఎక్కడికి వెళ్లిన..ఆ ప్రాంతంలో కొన్నిరోజులు స్టే చేయడానికి హోటల్స్, హోమ్ స్టేలను సజెక్ట్ చేసే బెటర్ యాప్ అని చెప్పొచ్చు.

ఈ యాప్ యాజమాన్యం తమ యూజర్లను మరింత అట్రాక్ట్ చేయడం కోసం..ఇలా కొన్ని సార్లు సెలబ్రిటీల ఇంట్లో ఉండవచ్చు అనే ఒక స్కీమ్‌ను కూడా కస్టమర్ల ముందుకు తీసుకొస్తుంది.ఇక ఈ స్కీమ్ కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న 11 మంది సెలబ్రిటీలను సెలక్ట్ చేయగా..అందులో జాన్వీ కపూర్ కూడా ఒకరు కావడం విశేషం. అంటే ఎయిర్ బీఎన్‌బీ యూజర్లు..జాన్వీ కపూర్ ఇంట్లో ఉండే ఈ అద్భుతమైన అవకాశాన్ని పొందవచ్చు అన్నమాట.ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి. శ్రీదేవి జ్ఞాపకాలు చూసి ఆనందించండి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Airbnb (@airbnb)