ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాం చోటు చేసుకుంది. ట్యాపింగ్ లో కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరును ప్రస్తావించారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ  రాధాకిషన్ రావు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పని చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పినట్టు తెలుస్తోంది.  ఫోన్  ట్యాపింగ్ తో కేసీఆర్  రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించే వారిని బెదిరించి లొంగదీసుకునేవాళ్లమని వెల్లడించారు. సివిల్  తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని, ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారమని చెప్పారు. బీఆర్ఎస్  డబ్బు రవాణాకు సహకరించేవారమని వాంగ్మూలంలో తెలిపారు రాధాకిషన్ రావు.