Bigg Boss Telugu 9 Finale: బిగ్ బాస్ 9 క్లైమాక్స్: కళ్యాణ్ పడాల 'విన్నర్' ఫిక్స్? ఓటింగ్ లో డీమాన్ పవన్ విధ్వంసం!

Bigg Boss Telugu 9 Finale: బిగ్ బాస్ 9 క్లైమాక్స్: కళ్యాణ్ పడాల 'విన్నర్' ఫిక్స్? ఓటింగ్ లో డీమాన్ పవన్ విధ్వంసం!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ వచ్చేసింది.. మరో రెండు రోజుల్లో, అంటే డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలే వేదికగా ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది.  సాధారణంగా బిగ్ బాస్ అంటేనే అంచనాలకు అందని ట్విస్టులు, ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ. కానీ ఈసారి సీజన్ ప్రారంభం నుంచి చివరి వరకు ఒక రేలర్ కోస్టర్ రైడ్‌లా సాగింది. ఆదిలో విన్నర్ అనుకున్న వారు మధ్యలోనే నిష్క్రమిస్తే, అసలు అంచనా లేని వారు ఇప్పుడు టాప్-5లో నిలిచి టైటిల్ రేసులో పోటీ పడుతున్నారు.

టాప్ 5 పోరులో అనూహ్య మలుపులు

ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్లను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. తనూజ, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, సంజన ఫైనల్ పోరులో నిలిచారు. ముఖ్యంగా 'సామాన్యులు'గా అడుగుపెట్టిన కళ్యాణ్, డీమాన్ పవన్ సెలబ్రిటీలను దాటుకుని ఇక్కడి వరకు రావడం బిగ్ బాస్ చరిత్రలోనే ఒక విశేషం. సంజన రెండు వారాల కంటే ఎక్కువ ఉండదని భావించిన విమర్శకుల నోళ్లు నొక్కి తనదైన శైలిలో టాప్-5 కి చేరుకుంది.

కళ్యాణ్ పడాల ఆటలో స్థిరత్వం, ప్రవర్తనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ప్రస్తుతం 40% ఓటింగ్ తో కళ్యాణ్ తిరుగులేని ఆధిక్యంలో ఉన్నాడు. తనూజ సీజన్ ఆరంభం నుంచి 'నాగార్జున దత్తపుత్రిక' అనే విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, తన గేమ్‌తో 35% ఓటింగ్ దక్కించుకుంది. అయితే చివరి వారాల్లో కొన్ని తప్పులు ఆమె విన్నింగ్ ఛాన్స్‌ను ప్రభావితం చేసేలా ఉన్నాయి.

ఓటింగ్ లెక్కలను మార్చేసిన డీమాన్ పవన్!

ఈ వారం ఓటింగ్‌లో అత్యంత పెద్ద హైలైట్ ఏదైనా ఉందంటే అది డీమాన్ పవన్ పుంజుకోవడమే. మొదట్లో రీతూ వెనుక ఉన్నాడని ముద్ర పడ్డ పవన్, ఆమె ఎలిమినేషన్ తర్వాత తన అసలైన 'డెమోన్' విశ్వరూపాన్ని చూపించాడు. టాస్కుల్లో తన సత్తా చాటుతూ ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. నిన్నటి వరకు నాలుగో స్థానంలో ఉన్న పవన్, ఇప్పుడు మూడో స్థానంలో ఉన్న ఇమ్మాన్యుయేల్ ను వెనక్కి నెట్టి పైకి వచ్చేశాడు. ఇమ్మాన్యుయేల్ తన కామెడీతో మొదట్లో ఆకట్టుకున్నా, తర్వాత ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోవడంతో ఓటింగ్‌లో వెనకబడ్డాడు.

►ALSO READ | Bigg Boss Telugu 9: "అమ్మ అరగంటలో వస్తానంది.. కానీ.." -కొడుకు ఫొటో చూసి సంజన కన్నీటి పర్యంతం!

ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్స్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే.. - కళ్యాణ్ పడాల తిరుగులేని ఆధిక్యంలో  ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో తనూజ ఉంది.  నాలుగో స్థానంలో ఉన్న డీమాన్ పవన్ మూడో స్థానంలోకి వచ్చారు.  ఇమ్మాన్యుయేల్ కాస్త వెనుకబడి నాలుగో స్థానంలోకి వెళ్లాడు. అయితే వీరి స్థానంలో కాస్త ఓటింగ్ అటు ఇటు మారే అవకాశం ఉంది. ఇక సంజన ఐదో స్థానంలో కొనసాగుతోందని సమాచారం. అయితే అధికారిక లెక్కలు తెలియాల్సి ఉంది..  

 ఆ అద్భుతం జరుగుతుందా?

డిసెంబర్ 19 అర్ధరాత్రి వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యే అవకాశాలు 90% కనిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఏదైనా జరగొచ్చు. పీఆర్ టీమ్స్ హడావుడి, ఆఖరి నిమిషం ఓటింగ్ తారుమారైతే తప్ప కళ్యాణ్ విజయాన్ని ఆపడం కష్టం. సామాన్యుడిగా వచ్చి టైటిల్ కొట్టి కళ్యాణ్ చరిత్ర సృష్టిస్తాడా? లేక తనూజ తొలి లేడీ విన్నర్‌గా నిలుస్తుందా? తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే!..