ధనుర్మాసం నెలంతా వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. భక్తుల సందడితో గుడులన్నీ కళకళలాడుతుంటాయి. వాకిళ్లలో కళ్లాపి చల్లి, స్వామివారికి ద్వారాలు తెరిచినట్లు ప్రత్యేక ముగ్గులతో అలంకరిస్తారు.ఈ మానంలోనే గోదాదేవి, రంగనాథస్వామిని పాశురాలతో పూజించింది. స్వామివారి మనసు గెలుచుకుని భోగిరోజు వివాహం చేసుకుందని చెప్పారు. అందుకే వైష్ణవాల యాల్లో రంగనాథస్వామి, గోదాదేవి పెళ్లి ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెలలో వాళ్లిద్దరిని దర్శిస్తే పాపాలు తొలిగి పోతాయని భక్తులు నమ్ముతారు.
వ్రతం :ధనుర్మాసం నెలంతా భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. రోజూ సూర్యుడు ఉదయించడానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. ఆవుపాలు, కొబ్బరినీళ్లు, పంచామృతాలతో దేవుడ్ని అభిషేకిస్తారు. రోజూ విష్ణువుకు చెందిన కథలు వింటారు. లేదా చదువుతారు. దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ నెలలో దేవుడికి పెట్టే ప్రసాదానికి చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసంలో మొదటి పదిహేను రోజులు పులగం లేదా పొంగలి పెడతారు. తర్వాత పదిహేను రోజులు దద్దోజనం సమ ర్పిస్తారు. ఈ వ్రతాన్ని నెల రోజులు చేయలేని వాళ్ళు 15 రోజులు చేస్తారు.
అదీ కుదరక పోతే వారం రోజుల పాటు నిష్టతో చేస్తారు. కనీసం ఒక్కరోజైనా నియను నిష్టలతో విష్ణువును ఆరాధిస్తే ఈ నెలలో అనుకున్న కోర్కెలు నెరవేరతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించి గోపికలు.. కృష్ణుడిని, గోదాదేవి శ్రీరంగనాథుడిని భర్తగా పొందారని పురాణాలు చెపున్నాయి. తమిళనాడులో ధనుర్మాస వ్రతాన్ని 'పావైనోంబు ' అంటారు. అమ్మాయిలు ఈ వ్రతాన్ని చేస్తే పెళ్లి అవుతుందని నమ్ముతారు.
శోభ: ధనుర్మాసంలో ప్రతి ఇల్లు సంతోషాలతో కళకళలాడుతుంది. స్త్రీలు వేకువజామునే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి, పేడనీళ్లతో కళ్లాపి చల్లుతారు. బియ్యపిండి, సున్నం లేదా తెల్లటి ఇసుక కలిపిన పిండితో ముగ్గులు వేస్తారు. అవి గీతలు, చుక్కలు, మెలికలతో వాకిళ్లను మరింత అందంగా చేస్తాయి. రకరకాల రంగులతో ముగ్గులను అలంకరిస్తారు.
►ALSO READ | జ్యోతిష్యం : 2026లో డబ్బు, విజయం, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించే మూడు రాశులు ఇవే..!
ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలో చామంతి బంతి పువ్వులు పెడతారు. అంతేకాదు ముగ్గుల మధ్య పసుపు, కుంకుమలు కూడా. చల్లుతారు. ఈ నెల రోజులంతా హరిదాసులు. జంగమ దేవర్లు గంగిరెద్దులు ఆడించే వాళ్లు... వస్తారు. వారి ఆట పాటలతో వీధులన్నీ పండుగ వాతా. వరణంతో సంతోషాలని పంచుతాయి.
స్వర్గ ద్వారాలు: ధనుర్మాసంలోని ధనస్సు అనే పదానికి ధర్మం అనే అర్థం ఉంది. అంటే ఈ నెలలో ఎవరైతే ధర్మబద్ధంగా నడుచుకుంటారో వాళ్లకు స్వర్గలోక ప్రవేశానికి ద్వారాలు తెరిచి ఉంటాయని భక్తుల విశ్వాసం. ధనుర్మాసానికి దేవత గోదాదేవి. 'గో' అంటే జ్ఞానం అని చెప్తారు. 'ర' అంటే ఇవ్వటం అనే భావం ఉంది. మొత్తంగా గోదాదేవి అంటే జ్ఞానాన్ని ఇచ్చేది అన్నమాట. అందుకే ఈ పాశురాలను ధనుర్మాసం అంతా వైష్ణవ ఆలయాల్లో గానం చేస్తారు. ధనుర్మాసం వెనుక తాత్వికమైన అర్థం కూడా ఉంది. ఈ మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు. దాంతో దరిద్రం పోయి, అస్టైశ్వర్యాలు లభిస్తాయంటారు. ఈ నెలలో తులసి ఆకులకు చాలా ప్రత్యేకత ఉంది. విష్ణువును తులసి మాలతో అలంకరిస్తారు.
