చార్మినార్ మాజీ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ మృతి

చార్మినార్ మాజీ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ మృతి

చార్మినార్ మాజీ ఎమ్మెల్యే, ఎంఐఎం (AIMIM) పార్టీ జనరల్ సెక్రటరీ అహ్మద్ పాషా ఖాద్రీ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (ఫిబ్రవరి 03) హైదరాబాద్ లోని ఒవైసీ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. 

2025 నవంబర్ 30న అనారోగ్య కారణాలతో కంచన్ బాగ్ లోని ఒవైసీ ఆస్పత్రిలో చేరారు. గత రెండేళ్లుగా మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న ఖాద్రీ చికిత్స పొందుతూ ఉన్నారు. 75 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 3వ తేదీన ఒవైసీ హాస్పిటల్ లో మృతి చెందారు. 

అహ్మద్ పాషా 2004లో తొలిసారి చార్మినార్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. 3 సార్లు చార్మినార్, ఒక సారి యాకుత్ పురా ఎమ్మెల్యే గా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఎంఐఎం పార్టీ జనరల్ సెక్రటరీ పదవిలో ఉన్నారు.