టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు తన రూట్ మార్చి ఒక సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘బైకర్’ (Biker) ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఏప్రిల్ 3న థ్రిల్లింగ్ రేస్ షురూ!
చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ‘బైకర్’ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. వాస్తవానికి ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. లేటెస్ట్ గా చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఏప్రిల్ 3న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయం అని ధిమా వ్యక్తం చేస్తున్నారు.
The engine's revved up 🏍️
— UV Creations (@UV_Creations) February 3, 2026
The track is ready 🛣️
Now, THERE IS NO STOPPING HIM ❤️🔥#BIKER grand release worldwide on April 3rd, 2026 💥💥#BIKERMovie #GoAllTheWay 🏁#BikerOnApril3rd
Charming Star @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha… pic.twitter.com/HhIsmshA7i
శర్వానంద్ మేకోవర్
ఈ సినిమా కోసం శర్వానంద్ ప్రాణం పెట్టారనే చెప్పాలి. ఒక ప్రొఫెషనల్ బైక్ రైడర్ పాత్రలో కనిపించడం కోసం ఆయన తన శరీరాకృతిని (Body Language) పూర్తిగా మార్చుకున్నారు. శారీరకంగానే కాకుండా, బైక్ రేసింగ్‌కు సంబంధించిన మెళకువలను నేర్చుకోవడానికి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు, టీజర్ గ్లింప్స్ చూస్తుంటే శర్వా లుక్ ఎంతో స్టైలిష్‌గా, మునుపెన్నడూ చూడని విధంగా ఉంది.
ఈ చిత్రానికి ‘లూజర్’ వెబ్ సిరీస్‌తో తన ప్రతిభను చాటుకున్న అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన టేకింగ్ ఎంతో రియలిస్టిక్‌గా ఉంటుందని పేరు. ఇక ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘ట్యాక్సీ వాలా’ ఫేమ్ మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. శర్వా, మాళవికల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు మరో ఆకర్షణ కానుంది. సీనియర్ హీరో రాజశేఖర్ ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర సినిమా మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం.
బైక్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్
తెలుగులో స్పోర్ట్స్ డ్రామాలు చాలానే వచ్చాయి, కానీ ప్యూర్ బైక్ రేసింగ్ నేపథ్యంలో వస్తున్న సినిమాలు చాలా తక్కువ. ఈ చిత్రంలో రేసింగ్ సీక్వెన్స్‌లను హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా చిత్రీకరించారట. వేగం, భావోద్వేగాలు, గెలుపు కోసం చేసే పోరాటం చుట్టూ ఈ కథ సాగుతుంది. సంక్రాంతి విజయం ఇచ్చిన జోష్‌తో శర్వానంద్ ‘బైకర్’గా మరో బ్లాక్ బస్టర్ కొడతారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ రేసులో శర్వా గెలుపు ఎలా ఉంటుందో తెలియాలంటే ఏప్రిల్ 3 వరకు ఆగాల్సిందే..
