సీఎం రేవంత్ అమెరికా పర్యటన మిస్టరీ కాదు..

సీఎం రేవంత్ అమెరికా పర్యటన మిస్టరీ కాదు..

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన మిస్టరీగా మారిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. అంతా అధికారికంగా.. షెడ్యూల్ ప్రకారమే జరిగిందని తెలిపింది. 

కేంద్రం నుంచి అనుమతి తీసుకున్న మీదటే సీఎం దావోస్ నుంచి అమెరికా వెళ్లార ని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా అధికారిక వివరణ ఇచ్చింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నా రని తెలిపింది. 

దావోస్ నుండి ఆయన తదుపరి ప్రయాణం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే అక్కడ అధికారికంగా హాజరు కావా ల్సిన కార్యక్రమాలు ముగిసిన తరువాతే జరిగిం దని పేర్కొంది. అనంతరం ముందుగా నిర్ణయిం చిన ప్రణాళికలో భాగంగా సీఎం అమెరికాకు ప్రయాణం అయ్యి అక్కడ హార్వర్డ్ యూనివర్సి టీలో ఉన్నత స్థాయి విద్యా సంస్థ నిర్దేశించిన కా ర్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపింది. 

షెడ్యూల్ ప్రకారం తరగతులు జరిగాయని అలాగే అక్కడ కోర్సు పూర్తయిన తర్వాత ఆ ప్రోగ్రాంకి సంబంధించిన సర్టిఫికెట్ ను కూడా యూనివర్సిటీ అధ్యాపకులు ముఖ్యమంత్రికి అందించారని పేర్కొంది. ప్రజలుకు వాస్తవాలు తెలియచేసి, అపోహలను తొలగించడం కోసం ఈ వివరణ జారీ చేస్తున్నట్లు పేర్కొంది.