కోల్కతాలో భూకంపం.. ఇళ్లు, ఆఫీసులు ఊగిపోవడంతో బయటకు పరుగులు తీసిన జనం

కోల్కతాలో భూకంపం.. ఇళ్లు, ఆఫీసులు ఊగిపోవడంతో బయటకు పరుగులు తీసిన జనం

కోల్ కతాలో భూకంపం సంభవించింది. మంగళవారం (ఫిబ్రవరి 03) రాత్రి భూప్రకంపనలతో ఇండ్లు, ఆఫీసులు ఊగిపోయాయి. ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలు ప్రజలు బయటకు పరుగులు తీశారు.  మయన్మార్ కేంద్రంగా 5.9 తీవ్రతతో వచ్చిన భూకంప ధాటికి వెస్ట్ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ లోనూ భూమి కంపించింది. 10 కిలోమీటర్ల లోతులో  సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ జియో సైన్సెస్ (GFZ) పేర్కొంది. 

గత 71 గంటల్లో మయన్మార్ లో భూకంపం రావడం ఇది మూడవసారి. అంతకు ముందు 4.1 తీవ్రతతో వచ్చింనట్లు జాతీయ భూకంప కేంద్ర ప్రకటించింది. 

Also Read : మణిపూర్ కొత్త సీఎం యుమ్నమ్ ఖేమ్ చంద్ సింగ్.. 

సోమవారం ఉదయం 3.30 గంటలకు 4.6 తీవ్రతతో అండమాన్ నికోబార్ దీవులలో భూకంపం సంభవించిన తర్వాత.. మయన్మార్ లో కూడా ఎర్త్ క్వేక్ రావడం గమనార్హం. మంగళవారం వచ్చిన ప్రకంపనలకు కోల్ కతా తో పాటు అటే ఢాకాలో కూడా ఇండ్లకు పెచ్చులు ఊడటంతో పాటు ఇంట్లో వస్తు సామాగ్రి చెల్లా చెదరుగా పడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.