తప్పిన పెను ప్రమాదం.. ముంబై ఎయిర్పోర్ట్లో ఢీకొన్న విమానాల రెక్కలు.. హైదరాబాద్ నుంచి వెళ్లిన ఫ్లైట్కు డ్యామేజ్

తప్పిన పెను ప్రమాదం.. ముంబై ఎయిర్పోర్ట్లో ఢీకొన్న విమానాల రెక్కలు.. హైదరాబాద్ నుంచి వెళ్లిన ఫ్లైట్కు డ్యామేజ్

ముంబై ఎయిర్ పోర్టులో అతిపెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు విమానాల్లో ఉండగానే రెండు విమానాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టడం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మంగళవారం (ఫిబ్రవరి 03) రాత్రి ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది.

ముంబై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా AI 2732, అదే సమయంలో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లి అప్పుడే ల్యాండ్ అయిన ఇండిగో 6E 791 విమానాల రెక్కలు ఢీకొన్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన విమానం ల్యాండ్ అయిన సమయంలోనే.. కోయంబత్తూర్ వెళ్లాల్సిన విమానం టేక్ ఆఫ్ కోసం వెనకకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాద సమయంలో రెండు ఫ్లైట్ లలో ప్రయాణికులు లోపలే ఉన్నారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన తర్వాత ప్యాసెంజర్లను సేఫ్ గా కిందికి దింపినట్లు ఎయిర్ ఇండియా స్పోక్స్ పర్సన్ ఒకరు తెలిపారు. 

షెడ్యూల్ డిలే కారణంగా ముంబై నుంచి కోయంబత్తూర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం కావడంతో.. టేక్ ఆఫ్ కోసం ట్యాక్సివే పైన ఎదురు చూస్తుండగా.. అప్పుడే వచ్చిన ఇండిగో ఫ్లైట్ రెక్కలు తగిలినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం రెక్కలు డ్యామేజ్ అయినట్లు పేర్కొన్నారు.