హార్ట్ స్ట్రోక్తో.. వైట్ టైగర్ మృతి.. వరంగల్ కాకతీయ జూపార్క్లో ఘటన

హార్ట్ స్ట్రోక్తో.. వైట్ టైగర్ మృతి.. వరంగల్ కాకతీయ జూపార్క్లో ఘటన
  • వయోభారంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్
  • హైదరాబాద్ డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం

వరంగల్: వరంగల్ కాకతీయ జూ పార్కులో పర్యాటకులను అలరిస్తున్న వైట్ టైగర్ హార్ట్ స్ట్రోక్ తో మంగళవారం (ఫిబ్రవరి 03) ఉదయం మృతి చెందింది. దాదాపుగా 14 ఏండ్ల సగటు ఆయుష్షుతో జీవించే ఈ జాతికి చెందిన పులి వయోభారం కారణంగా గత కొన్ని రోజులుగా అనారో గ్యంతో బాధపడుతోంది. ఆహారం సరిగ్గా తినకపోవడంతో నీరసించిపోయింది. 

హైదరాబాద్ తో పాటు స్థానిక వెటర్నటీ డాక్టర్లు వైద్య చికిత్సలు అందించి ఎలెక్ట్రోపౌడర్లు, కొబ్బరి నీళ్లు సైతం అందించారు. అయినా బీపీ పెరగడంతో ఆయాసం ఎక్కువైంది. ఇటీవలే వాంతులు చేసుకుంది. తీరా ఉదయం 07 గంటలకు సిబ్బంది వెళ్లిచూడ గా టైగర్ ఎన్ క్లోజర్ లో మృతి చెంది కనిపించింది. 

హైదరాబాదు నుంచి డాక్టర్ల బృందం వచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. లివర్ ఫంక్షన్ ఇన్ ఆగడానికి తోడు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు ని ర్ధారించారు. కాగా గతేడాది జులై నెలలో వైట్ టైగర్ ను అధికారులు వరంగల్ జూ పార్కు తీసుకువచ్చారు.