గుడ్ న్యూస్ మొబైల్ యూజర్స్.. మొబైల్ ప్రీపెయిడ్ వ్యాలిడిటీని పెంచుతూ ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. టెలికం సంస్థలన్నీ ప్రీపెయిడ్ వ్యాలిడిటిని 28 రోజుల నుంచి 30 రోజులకు పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన వ్యాలిడిటీ అక్టోబర్ 22 నుంచి అమలు చేయాలని జియో, ఎయిర్ టె్, వీఐ తదితర టెలికం సంస్థలకు ఆదేశించింది.
ట్రాయ్ (TRAI) కొత్త నిబంధనల ప్రకారం మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్లకోసం టెలికాం కంపెనీలు 30 రోజుల వ్యాలిడిటీ, కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లను తప్పనిసరిగా అందించాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు 28 రోజుల ప్లాన్లతో ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వచ్చేది. ఇకపై 30 రోజుల ప్లాన్ అందుబాటులోకి రావడంతో ఏడాదికి 12 సార్లు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి నెలా ఒకే నిర్దిష్ట తేదీన ప్లాన్ రెన్యూవల్ చేసుకునేలా ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది.
మరోవైపు ఇంటర్నెట్ అవసరం లేని గ్రామీణ ప్రజలు, వృద్ధులు , ఫీచర్ ఫోన్ కస్టమర్ల కోసం తక్కువ ధరకే కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ప్యాక్‌లు లభిస్తాయి.
సెప్టెంబర్ 22, 2026న వచ్చిన ట్రాయ్ నోటిఫికేషన్ ప్రకారం, అక్టోబర్ 22, 2026 నాటికి టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్, వీఐ తదితర సంస్థలు ఈ ప్లాన్లను పూర్తిగా అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది.
