23YearsForManmadhudu: ‘మన్మథుడు’కి 23 ఏళ్లు.. పొట్ట చెక్కలయ్యే డైలాగ్స్తో మేకర్స్ స్పెషల్ వీడియో..

23YearsForManmadhudu: ‘మన్మథుడు’కి 23 ఏళ్లు.. పొట్ట చెక్కలయ్యే డైలాగ్స్తో మేకర్స్ స్పెషల్ వీడియో..

తెలుగు సినీ పరిశ్రమలో మన్మథుడు (Manmadudu) అంటే ఠక్కున గుర్తొచ్చే హీరో నాగార్జున (Nagarjuna). ఇది పచ్చినిజం. 66 ఏళ్ల వయసున్న నాగ్.. ఇప్పటికీ 33 ఏళ్ళ కుర్రాడిగా అదే స్టైల్తో రాణిస్తుండటం విశేషం. నాగ్ హీరోగా చేసిన మన్మథుడు సినిమా కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీనే. ఈ మాట త్రివిక్రమ్ స్టైల్లో చెప్పాలంటే.. ‘‘అమ్మ, ఆవకాయ ఎప్పుడూ బోర్‌ కొట్టనట్టు..‘మన్మథడు’ కూడా బోర్‌ కొట్టడు’’ అనేలా ఉంటుంది. అందుకే ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. 2002 డిసెంబరు 20న లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా విడుదలై.. నేటికీ (2025 డిసెంబర్ 20) 23 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా మన్మథుడ్ని ఓ సారి గుర్తు చేసుకుందాం..

మన్మథుడు సినిమాను కే.విజయభాస్కర్ డైరెక్ట్ చేయగా, త్రివిక్ర‌మ్ కథ, మాట‌లు అందించారు. సోనాలి బింద్రే, అన్షు స‌గ్గ‌ర్ హీరోయిన్‌లుగా న‌టించారు. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్పై నాగార్జున నిర్మించారు. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా ద్వారా నాగ్‌లోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు డైరెక్టర్ కే.విజయభాస్కర్. మన్మథుడు అంటే అందంతో అమ్మాయిల్ని తన చుట్టూ తిప్పించుకుంటాడు లేదా తనే అమ్మాయిల వెంట తిరుగుతాడు. కానీ ఈ వెండితెర ‘మన్మథుడు’ మాత్రం అమ్మాయిల్ని ద్వేషిస్తాడు. అందుకే సినిమా టైటిల్ కింద క్యాప్షన్గా "" He Hates Women "అని రాసి ఉంటుంది. 

ఇప్పటికీ, ఈ సినిమాని టీవీల్లో, యూట్యూబ్లో చూస్తూ ప్రేక్షకులు థ్రిల్ అవుతున్నారు. అందుకు ముఖ్య కారణం.. ఇందులోని ప్రేమ, కామెడీ, సెంటిమెంట్‌ సమపాళ్లలో సెట్ అవ్వడమే. ఇక వీటికి తోడు త్రివిక్రమ్ రాసిన అరుదైన డైలాగ్స్. అలాగే నాగ్, సోనాలి, బ్రహ్మానందం ప్యారిస్‌ వెళ్లినపుడు వచ్చే హాస్య సన్నివేశాలు చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. ఇక మరో ముఖ్యమైన పాయింట్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఇందులోని ఆరు పాటలు ఆరు ఆణిముత్యాలు.  దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మనసును పిండేస్తుంది. ఇలాంటి మన్మథుడుని మరొకసారి గుర్తుచేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ స్పెషల్ వీడియో పంచుకుంది.

గుర్తిండిపోయే త్రివిక్రమ్ డైలాగ్స్:

*అమ్మాయిలకు ప్రేమించడానికి టైం ఉంటుంది కానీ పెళ్లి చేసుకోవడానికి ధైర్యం ఉండదు. ప్రేమించినపుడు పెద్దోళ్లు గుర్తుకురారు, పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించినోడు గుర్తుకురాడు.
*నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను కానీ ఇంత ఎంత ఇష్టమో చెప్పగనలను.

 నాగ్‌: మీరు ఆవిడను ప్రేమించారా? ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా?

‘మన్మథుడు’కి పదిహేడేళ్లు
వాడి ప్రాబ్లబ్‌ వల్ల వాడికి అన్నీ ఎక్కువే. ఆస్తి, ఐశ్వర్యం, కోపం, ప్రేమ అన్నీ. ఎంత ఎక్కువ అంటే చిన్నప్పుడు వాడి దగ్గర ఓ కుక్క పిల్ల ఉండేది. అదంటే వాడికి ప్రాణం. వాడికి పదేళ్ల వయసపుడు అది చచ్చిపోయింది. లైఫ్‌లో మళ్లీ కుక్క పిల్లని దగ్గరికి రానీలేదు. వాడికి కోపం అది వాణ్ని వదిలేసి వెళ్లిపోయిందని. ఇప్పుడు మీరు చూస్తున్న అభి.. అభి కాదమ్మా. వాడు వేరు... వాడు వేరు.

వాడి కోపం ప్రళయం
వాడి ప్రేమ సముద్రం
వాడి జాలి వర్షం

వాడి ప్రాబ్లబ్‌ వల్ల వాడికి అన్నీ ఎక్కువే. ఆస్తి, ఐశ్వర్యం, కోపం, ప్రేమ అన్నీ. ఎంత ఎక్కువ అంటే చిన్నప్పుడు వాడి దగ్గర ఓ కుక్క పిల్ల ఉండేది. అదంటే వాడికి ప్రాణం. వాడికి పదేళ్ల వయసపుడు అది చచ్చిపోయింది. లైఫ్‌లో మళ్లీ కుక్క పిల్లని దగ్గరికి రానీలేదు. వాడికి కోపం అది వాణ్ని వదిలేసి వెళ్లిపోయిందని. ఇప్పుడు మీరు చూస్తున్న అభి.. అభి కాదమ్మా. వాడు వేరు... వాడు వేరు.