హైదరాబాద్ లో ఇవాళ( డిసెంబర్ 20).. ఈ రూట్ లో వెళ్లకుంటే బెటర్..

హైదరాబాద్ లో ఇవాళ( డిసెంబర్ 20).. ఈ రూట్ లో వెళ్లకుంటే బెటర్..

హైదరాబాద్ సిటీ, వెలుగు: మెహదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాక్​పనుల నేపథ్యంలో 21 వరకు  ట్రాఫిక్ డైవర్షన్​ ఉంటుందని సిటీ ట్రాఫిక్​ జాయింట్​సీపీ జోయల్​ డేవిస్​ తెలిపారు. రేతిబౌలి జంక్షన్ నుంచి ఎస్.డి. ఐ హాస్పిటల్ వరకు రోడ్డు స్ట్రెచ్​లో రెండు లేన్లుస్కైవాక్ నిర్మాణ పనుల కాలంలో రోడ్లు క్లోజ్​చేస్తున్నట్టు తెలిపారు. 
    

  • అత్తాపూర్ నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్లే వాహనదారులు: రేతిబౌలి – నానల్ నగర్ జంక్షన్ – ఫిల్మ్ నగర్ – బంజారాహిల్స్ రోడ్డును ఎంచుకోవాలి.  
  • అత్తాపూర్ నుంచి నాపల్లి వైపు వెళ్లే వాహనదారులు: గుడిమల్కాపూర్ – యాదవ్ భవన్ – మీరజ్ కేఫ్ జంక్షన్ రైట్ టర్న్ – ఆసిఫ్ నగర్ – మల్లెపల్లి – నాంపల్లి రూట్ తీసుకోవాలి.
  • టోలీచౌకీ నుంచి నాంపల్లి, లక్డీకాపూల్ వైపు వెళ్లే ట్రాఫిక్: నానల్ నగర్ జంక్షన్ – బాలికా భవన్ – లక్ష్మీ నగర్ – పిల్లర్ నం.68, పిల్లర్ నం.57 వద్ద ‘యు’ టర్న్ – గుడిమల్కాపూర్ – యాదవ్ భవన్ – మీరజ్ కేఫ్ జంక్షన్ రైట్ టర్న్ – ఆసిఫ్ నగర్ – మల్లెపల్లి – నంపల్లి – లక్డీకాపూల్ రూట్​లో వెళ్లవచ్చు.

ఇయ్యాల ఈ రూట్లలో వెళ్లకుంటే బెటర్!

శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్​పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాష్ట్రపతి నిలయం నుంచి గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీ సంస్థకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ పరిధిలోని పలు మార్గాల్లో నేడు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడనుందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు గచ్చిబౌలి, ఐఐఐటీ, ఐటీసీ జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తనున్నాయి. రోడ్ నం. 45 కేబుల్ బ్రిడ్జ్, ఐకియా ఫ్లైఓవర్, ఆర్బిట్ రేషన్ రోడ్, డెలాయిట్, గచ్చిబౌలి జంక్షన్, ఇందిరానగర్, ఐఐఐటీ జంక్షన్, పుల్లెల గోపిచంద్ అకాడమీ, బ్రహ్మకుమారీ రోడ్డులో రాష్ట్రపతి పర్యటిస్తారు. ప్రయాణికులు ఈ మార్గాలను సాధ్యమైనంతవరకు నివారించి, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని పోలీసులు  సూచించారు.