ఇస్లామాబాద్: సింధూ నది జలాల ఒప్పందం రద్దుపై పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మొసలి కన్నీ్ళ్లు కార్చారు. భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తోందని ఆరోపించారు. ఇండియా నిర్ణయం పాకిస్తాన్ పౌరుల జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాక్ ప్రజలు ఆకలి, దాహంతో చనిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వెళ్లగక్కారు.
భారత్ చర్యలు పాకిస్తాన్‌ను వరదలు, కరువులకు గురిచేస్తున్నాయని.. దేశంలో వ్యవసాయ చక్రాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందన్నారు. సింధు నదీ పరీవాహక ప్రాంతంలో నీటి కొరత లక్షలాది మంది పాకిస్తానీయుల జీవితాలకు, జీవనోపాధికి ప్రత్యక్ష ముప్పు కలిగిస్తోందని అన్నారు. సిందు నది జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ అంతటా పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. సిందూ నది నీటి సరఫరాను అడ్డుకోవడం యుద్ధ చర్యగా పరిగణించబడుతుందని ఆయన హెచ్చరించారు.
అసలేం జరిగిందంటే..?
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో 2025, ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. పహల్గాంలోని పచ్చని ప్రకృతి అందాలు తిలకిద్దామని వచ్చిన పర్యాటకులపై పాక్ ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ టెర్రర్ ఎటాక్‌లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.
►ALSO READ | మొత్తం బంగ్లా షేక్ అయితది: హాదీని చంపే ముందే గర్ల్ ఫ్రెండ్‌కు చెప్పిన నిందితుడు
ఈ మేరకు పాకిస్తాన్‌తో 1960 నాటి సింధూ నది జలాల ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసుకుంది. దీంతో పాక్‌లో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడింది. నీటి కొరతతో పాక్ అల్లాడుతోంది. సిందూ నది పరివాహక ప్రాంతంలో అయితే పరిస్థితి మరింత దిగజారింది. కనీసం తాగేందుకు నీళ్లు లేక, వ్యవసాయం చేయడానికి సాగు నీరు లేక ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పరిస్థితి రోజురోజుకు భయంకరంగా మారుతుండటంతో ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్న పాక్ నేతలు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఇండియా ఏకపక్షంగా సిందూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుందని దొంగ ఏడుపు ఏడుస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆ దేశ ప్రధాని ఇషాక్ దార్ సిందూ నది జలాల ఒప్పందం రద్దుపై గగ్గోలు పెట్టారు.
