జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల్లో కీలకమైన బుధుడు గ్రహాల రాకుమారుడు. తెలివితేటలు.. వ్యాపారం విషయంలో కీలక పాత్ర పోషిస్తాడు. బుధుడు సంచారం చేసే సమయంలో మంచి ప్రయోజనాలు రాశి చక్ర గుర్తులకు కలుగుతాయి. జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే విశేషమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
వ్యాపారం మరియు వాక్చాతుర్యానికి బాధ్యత వహించే గ్రహం బుధుడు డిసెంబర్‌లో తన సొంత రాశిలోకి ప్రవేశిస్తాడు.2025 డిసెంబర్ 20 శనివారం ఉదయం 6:13 గంటలకు బుధుడు తన సొంత రాశి అయిన జ్యేష్ఠలోకి ప్రవేశించాడు. బుధుడికి జ్యేష్ఠ అంటే ఎంతో ఇష్టం. దీనివల్ల కొన్ని రాశులవారి కోరికలన్నీ సులువుగా నెరవేరతాయి. జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. సంతోషం వెల్లివిరుస్తుంది. కొన్ని రాశులవారైతే జీవితంలో ఎన్నడూ పొందని డబ్బును పొందుతారు. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం..
మేష రాశి : ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ప్రతి పనిలో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. కొత్త వారితో పరిచయాలు పెరుగుతాయి. మీరు చేసే కార్యమైనా అనుకున్న సమయానికి పూర్తవుతుంది. వృత్తి .. వ్యాపారాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
వృషభరాశి : జ్యేష్టా నక్షత్రంలో బుధుని సంచారం వలన ఈరాశి వారికి సానుకూల ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు.ఆధ్యాత్మిక విషయాల్లో చురుకుగాపాల్గొంటారు. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంత కాలంగావేధిస్తున్న సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
మిథున రాశి : బుధుడు ఇదే రాశికి అధిపతి.. నక్షత్రం మార్పు వలన ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొందరికి ఉద్యోగ మార్పు జరిగే అవకాశం ఉంది. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నవారికి అనుకూల సమాచారం అందే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆదాయం పెరగడం వల్ల గతంలో ఉన్న ఆందోళనలు తగ్గుతాయి.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ, కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించుకోవాలి. అనుకోని మార్గాల్లో ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారులకు తలపెట్టిన పనుల్లో విజయం ఉంటుంది.
సింహరాశి: బుధ సంచారంలో మార్పు వలన ఈ రాశి వారు గణనీయమైన విజయాన్ని సాధిస్తారు, కెరీర్ విషయంలో అభివృద్ది ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి గణనీయమైన అవకాశాలను పొందుతారు. గతంలో చేసిన కృషికి ప్రతిఫలం లభిస్తుంది. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.
కన్యారాశి: బుధుడు జ్యేష్ఠ నక్షత్రంలోకి ఈ రాశికి వారికి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మొండి బకాయిలు వసూలవుతాయి. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. ఉద్యోగస్తులు.. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి.
తులారాశి: ఈ రాశివారు ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశాలు రావచ్చు. ఈ ప్రయాణాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరత్వం పెరిగి, ఖర్చులపై నియంత్రణ సాధించగలుగుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
వృశ్చికరాశి: జ్యేష్ఠ నక్షత్రంలో బుధ సంచారం వలన ఈ రాశి వారికి అన్ని విధాల కలిసొస్తుంది. గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు . వీరిలో నాయకత్వ సామర్థ్యాలు పెరుగుతాయి .ఆస్తులు వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారి కల నెరవేరుతుంది. వ్యాపారస్తదులకు అధికంగా లాభాలు వస్తాయి. ప్రేమ.. పెళ్ళి వ్యవహారాలు కలసి వస్తాయి.
ధనస్సు రాశి: బుధుడు సంచారంలో మార్పు వలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆర్దిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అనుకోకుండా సుదూర ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వర్తక, వ్యాపారాలు చేసే వాళ్లు కొన్నా సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మకర రాశి : ఈ రాశి వారికి బుధ గ్రహం జ్యేష్టా నక్షత్రంలో సంచారం వలన ఆర్థికంగా లాభం పొందే అవకాశాలున్నాయి. స్నేహితులు..బంధువుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో కీలకపాత్ర పోషిస్తారు.
కుంభరాశి: బుధుడు జ్యేష్ఠ్యా నక్షత్రంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి కెరీర్ పరంగా ఊహించని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు వస్తాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి.కుటుంబంలో కొంత ఆందోళనకర పరిస్థితులు ఉంటాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
మీనరాశి: ఈ రాశి వారు అపారమైన తెలివితేటలతో ఏ సమస్యనైనా సులభంగా అధిగమిస్తారు. కొంతమంది వాదించే అవకాశం ఉంది. మీరు అలాంటి వారికి దూరంగా ఉండండి. పూర్వీకుల నుంచి ఆస్తులు పొందే అవకాశం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. సానుకూల మార్పులను లు జరిగే అవకాశం ఉంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
