మరదలితో వివాహేతర సంబంధం.. భార్యను ముక్కలుముక్కలుగా చేసిన గురుమూర్తి కేసులో ట్విస్ట్

మరదలితో వివాహేతర సంబంధం.. భార్యను ముక్కలుముక్కలుగా చేసిన  గురుమూర్తి కేసులో ట్విస్ట్

హైదరాబాద్ మీర్ పేట్  లో  సంచలనం  సృష్టించిన వెంకట మాధవి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.  2025 జనవరి 15 న మాధవిని హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేసిన భర్త గురుమూర్తికి  మరదలితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో లేటెస్ట్ గా  సైంటిఫికెల్ ఆధారాలను కోర్టు ముందు పెట్టారు పోలీసులు.  36 మంది సాక్షులను విచారించిన పోలీసులు.. మరదలితో వివాహేతర సంబంధం గురించి పలు సార్లు ప్రశ్నించినందుకే  భార్య మాధవిని గురుమూర్తి  హత్య చేసినట్లు తేల్చారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో  రోజువారి ఈ కేసు  ట్రయల్ కొనసాగుతోంది. 

ప్రకాశం జిల్లాకు చెందిన ఉప్పల సుబ్బమ్మ, వెంకటరమణ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు బిడ్డలు. పెద్ద కుమార్తె వెంకటమాధవి(35)ని13 ఏండ్ల కింద అదే జిల్లాకు చెందిన గురుమూర్తికి ఇచ్చి పెండ్లి జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు. గురుమూర్తి ఆర్మీలో జవాన్​గా పని చేసి వాలంటరీ రిటైర్మెంట్​తీసుకున్నాడు. తర్వాత కంచన్​బాగ్ ​డీఆర్డీవోలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ మీర్ పేట్ పీఎస్​పరిధి జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నాడు.ఈ క్రమంలో జనవరి 16వ తేదీన భార్యతో గొడవపడిన గురుమూర్తి.. తర్వాత తన భార్య కనిపించడం లేదని అత్తమామలకు సమాచారం ఇచ్చాడు. తనతో గొడవ పడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఒక్కడే వెళ్లి మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా.. 

దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటి ఎదురుగా, పక్కన ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో 16వ తేదీన గాని, ఆ తర్వాత గాని..వెంకటమాధవి ఎక్కడా బయటకు వెళ్లినట్టుగాని, లోపలకు వచ్చినట్టు గాని కనిపించలేదు. పలుమార్లు గురుమూర్తి కొన్ని కవర్లతో బయటకు వెళ్లి రావడాన్ని గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించినట్టు సమాచారం. తర్వాత వెంకటమాధవి అత్తతో ఫిర్యాదు తీసుకుని సీసీటీవీ ఫుటేజీల గురించి గురుమూర్తికి చెప్పి ప్రశ్నించారు. ఇక కేసు నుంచి బయటపడలేనని అర్థమైన గురుమూర్తి..తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.  

ఎముకల నుంచి మాంసం వేరు చేసి.. 

జనవరి 15, 16న భార్యాభర్తలు గురుమూర్తి, వెంకటమాధవి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గురుమూర్తి 16వ తేదీన భార్య తలను గట్టిగా గోడకేసి కొట్టి హత్య చేశాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి సాక్ష్యాలు లేకుండా చేయాలనుకున్నాడు. ముందుగా భార్య డెడ్​బాడీని మటన్​కొట్టే కత్తితో ముక్కలు ముక్కలుగా నరికాడు. ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేశాడు. మొత్తం మాంసాన్ని ఇంట్లో ఉన్న కుక్కర్​లో దఫదఫాలుగా వేసి ఉడికించి పీస్​పీస్​చేశాడు. తర్వాత ఎముకలను కాల్చివేశాడు. తర్వాత పొడిగా చేశాడు. వీటన్నింటిని కవర్లలో వేసుకొని ఒకే చోట వేస్తే దొరికిపోతానని డ్రైనేజీల్లో, మీర్​పేట చందచెరువులో కలిపాడు. భార్యను చంపడానికి ముందు గురుమూర్తి ప్రాక్టీస్​కోసం కుక్కను చంపాడని తెలుస్తోంది. భార్యను హత్య చేయాలని గురుమూర్తి ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. వ్యూహాం ప్రకారం అత్యంత క్రూరంగా గురుమూర్తి తన భార్యను హత్య చేశాడు.

►ALSO READ | గుట్కా ,లిక్కర్ విక్రయిస్తున్న కిరాణా దుకాణం సీజ్