గుట్కా ,లిక్కర్ విక్రయిస్తున్న కిరాణా దుకాణం సీజ్

గుట్కా ,లిక్కర్ విక్రయిస్తున్న కిరాణా దుకాణం సీజ్

శామీర్ పేట, వెలుగు: నిషేధిత గుట్కా ప్యాకెట్లు, లిక్కర్ విక్రయిస్తున్న కిరాణా దుకాణాన్ని అధికారులు సీజ్ చేశారు. తూంకుంట సర్కిల్ పరిధిలోని దేవరయంజాల్ లో కొంపల్లి రోడ్డు పై ఓ కిరాణా దుకాణానికి ట్రేడ్ లైసెన్స్​ ఎంక్వైరీ కోసం శానిటరీ ఇన్​స్పెక్టర్ బి.జానీ బృందం వెళ్లి పరిశీలించగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు ,  లిక్కర్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ట్రేడ్ లైసెన్స్​ కూడా లేదు. దీంతో ఆ దుకాణాన్ని సీజ్ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి తెలిపారు.