తెలంగాణ చరిత్ర, సంస్కృతి.. పెంబర్తి హస్తకళలు..చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్

తెలంగాణ చరిత్ర, సంస్కృతి.. పెంబర్తి హస్తకళలు..చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్

కఠినమైన ఇత్తడి లోహ షీట్ పైన అద్భుతమైన కళాఖండాలు చెక్కే కళ జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో పుట్టింది. ఇక్కడ తయారయ్యే ఇత్తడి కళారూపాలు, నగిషీలు, జ్ఞాపికలు కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందాయి. ఈ హస్త కళా నైపుణ్యంలో ఎక్కువగా ఇత్తడిని ఉపయోగిస్తారు. పెంబర్తి ఇత్తడి కళా నైపుణ్యం హిందూ ఇస్లాం ప్రభావానికి లోనై ఒక లౌకిక కళా నైపుణ్యంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ దేవతా విగ్రహాలు, ధ్వజస్తంభాల తయారీతోపాటు అత్తరు డబ్బాలు, వేలాడే షాండ్లియర్, అలంకరించిన కుండీలు, మెమెంటో వంటి కళాఖండాలు తయారు చేస్తారు. 

మహారాష్ట్రలోని తుల్జాభవానీ మాత ఆలయంలో పెంబర్తి హస్తకళాకృతులు కనిపిస్తాయి. పెంబర్తి ఘనతను అయిలాచారి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. 1956లో అయిలాచారి నేతృత్వంలో విశ్వకర్మ బ్రాస్, కాపర్, సిల్వర్, ఇండస్ట్రియల్ సొసైటీ ఏర్పాటైంది. 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు ఇతనే లోగోలు, షీల్డ్​లు రూపొందించారు. సినీరంగంలో అందించే నంది పురస్కార ప్రతిమను ఇతనే రూపొందించాడు. 

కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ పరిశ్రమల పునరుద్ధరణ నిధుల పథకం (ఎస్ఎఫ్ యూఆర్ టీఐ) కింద పెంబర్తి ఇత్తడి కళాకృతుల క్లస్టర్​ను ఏర్పాటు చేసి కోటిన్నర మంజూరు చేసింది. 
పెంబర్తి లోహ హస్తకళలు2010లో భౌగోళిక గుర్తింపు పొందాయి. 

చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్

సిద్దిపేట జిల్లా చేర్యాల గ్రామం స్క్రోల్ పెయింటింగ్​కు ప్రసిద్ధి చెందింది. ఈ పెయింటింగ్స్​లో ఇతిహాసాలు, పురాణగాథలను డిజైన్​లుగా తీసుకుని మట్టి రంగులతో గోడకు వేలాడదీసే పెయింటింగ్స్ వేస్తారు. 

►ALSO READ | ఎన్ఎంపీఏలో అప్రెంటీస్ ఖాళీలు.. బీటెక్ ఉంటే చాలు..దరఖాస్తు చేసుకోండిలా

రమ్యమైన జానపద శైలిలో వస్త్రంపై చిత్రీకరించి పౌరాణిక గాథను కళ్లకు కట్టినట్టు విశదీకరించే చేర్యాల్ స్క్రోల్ పెయింటింగ్స్​కు తెలంగాణ ప్రసిద్ధి చెందింది.
చేర్యాల పెయింట్స్ కళాకారులను నకాషీలు అంటారు. వీటిని థీమ్ పెయింటింగ్ అని కూడా వ్యవహరిస్తారు. చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్​కు 2010లో భౌగోళిక గుర్తింపు లభించింది.