హైదరాబాద్: హైదరాబాద్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం భారీగా అక్రమ మద్యాన్ని పట్టుకుంది. రూ.2.50 లక్షల విలువైన నాన్-డ్యూటీ పెయిడ్ మద్యం పట్టుకున్నట్లు తెలిపింది. ఢిల్లీ సమీప నోయిడా నుంచి తెలంగాణకు అక్రమ మద్యం సరఫరా చేస్తుండగా పోలీసులు సీజ్ చేశారు. కారుతో పాటు 84 ఢిల్లీ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.
ఉప్పల్ భాగయత్ ప్రాంతంలో కాపు కాసి ఎస్టీఎఫ్ బీ టీమ్ చేసిన ఆపరేషన్లో ఈ మద్యం పట్టుబడింది. కారులో మద్యం తరలిస్తున్న డ్రైవర్ ఆదిత్య ప్రసాద్ను అరెస్ట్ చేశారు. మద్యం తెప్పించిన ఉప్పల్ వాసి గోపాల్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. మద్యం కొనుగోలు డబ్బులు గోపాల్‌రెడ్డే చెల్లించినట్టు వెల్లడైంది.
ప్రతిష్ట హోం 408లో గోపాల్‌రెడ్డి నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో పంచాయతీ ఎన్నికల సమయంలోనూ మద్యాన్ని అక్రమంగా సరఫరా చేసినట్లు తెలిసింది. నల్లగొండకు రెండు సార్లు 30 కార్టన్ల చొప్పున మద్యం సరఫరా చేశాడు. ఇదిలా ఉండగా.. తాజాగా పట్టుబడిన కేసులో ముగ్గురిపై కేసు నమోదైంది. ఇద్దరు నిందితులు అరెస్ట్ కాగా ఒకరు పరారీలో ఉన్నాడు. మద్యం బాటిళ్లు, కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన వస్తువులు ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. ఢిల్లీకి చెందిన ప్రసాద్ డిస్ట్రిబ్యూటర్‌పై కూడా కేసు నమోదు చేశారు.
