షాకింగ్ ఇన్సిడెంట్.. మనసును కలవరపెట్టే ఘటన..ఆడుకుంటున్న బాలుడిపై అకారణంగా దాడి.. చిన్నారిని ఫుడ్ బాల్ లా తన్నిన సైకో ..బాధతో విలవిలలాడుతున్న పసివాడి దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది.
అది బెంగళూరులోని త్యాగరాజనగర్.. డిసెంబర్ 14 మధ్నాహ్నం 1.15గంటల సమయం.. త్యాగరాజనగర్ లోని ఓ వీధిలో చిన్నారులు షటిల్ బ్యాడ్ మింటన్ ఆడుకుంటున్నారు. ఉత్సాహాంగా కేరింతలుకొడుతూ ఆడుకుంటున్నారు పిల్లలు.. ఇంతో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
వీధిలో తోటి పిల్లలలో ఆడుకుంటున్న ఓ బాలుడిపై ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా సైకోలా దాడి చేశాడు. నిందితుడు ఇంటినుంచి బయటికి వచ్చి ఏదో గొడవపడేందుకు వెళ్తున్నట్టు షర్టు చేతులు మల్చి చేతులు పైకి లేపి పరుగెత్తుకుంటూ వచ్చి ఆడుకుంటున్న బాలుడిని నడివీపున బలంగా తన్నాడు.. బాలుడు నేలపై పడి విలవిల కొట్టుకుంటున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. నిందితుడు ఏమీ ఏరుగనట్లు మెల్లగా నడుచుకుంటూ వెళ్లడం వీడియోలో కనిపించింది.
కింద పడ్డ బాలుడు తలకు తీవ్రంగా గాయమైంది.. కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఏమి జరిగిందో అర్థంకాక బాలుడి పేరెంట్స్ తల్లడిల్లిపోయారు. విషయం తెలుసునేందుకు కాలనీలోని సీసీఫుటేజ్ పరిశీలించడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అకారణంగా తమ పిల్లాడిని తన్నిన ఆ వ్యక్తిని కాలనీలో ఉండే రంజన్ గా గుర్తించారు. బాలుడి పేరెంట్స్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. రంజన్ కు నేర చరిత్ర ఉన్నట్లు ..తరుచుగా కాలనీ వాసులతో గొడవలు పడుతున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో తెలిపారు బాలుడి తల్లిదండ్రులు. నిందితుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి.. ఇలాంటివి మరోసారి జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి బెయిల్ పై విడుదల చేశారు. కేసు దర్యాప్తు సాగుతోంది.
ತನ್ನ ಪಾಡಿಗೆ ಮಗು ಆಟ ಆಡ್ತಾ ಇದ್ದಾಗ ದಿಡೀರ್ ಅಂತ ಬಂದ ವ್ಯಕ್ತಿ ಮಗುವಿಗೆ ಒದ್ದ ದೃಶ್ಯ ಮೊಬೈಲ್ ಅಲ್ಲಿ ಸೆರೆ. #bangalore pic.twitter.com/ELARsnoSqh
— pragathi shetty (@pragathishett25) December 19, 2025
