IND vs SA: బుమ్రా, శాంసన్, సుందర్ ఇన్.. సౌతాఫ్రికాపై ఐదో టీ20లో ఆ ముగ్గురిపై వేటు

IND vs SA: బుమ్రా, శాంసన్, సుందర్ ఇన్.. సౌతాఫ్రికాపై ఐదో టీ20లో ఆ ముగ్గురిపై వేటు

సౌతాఫ్రికాతో ఐదో టీ20లో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. శుక్రవారం (డిసెంబర్ 19) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే భారత జట్టు 3-1 తేడాతో విజయం సాధిస్తుంది. నాలుగో టీ20 పొగమంచు కారణంగా రద్దు కావడంతో ఐదో టీ20లో ఇండియా, సౌతాఫ్రికా జట్లు ఖచ్చితంగా విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్నాయి. తొలి మూడు టీ20 మ్యాచ్ లు చూసుకుంటే.. భారత జట్టుకు రెండు విజయాలు బౌలింగ్ ద్వారానే వచ్చాయి. దీంతో చివరి టీ20లో భారత జట్టు బ్యాటింగ్ పై ఫోకస్ చేయనుంది.

మూడో టీ20లో గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియా ఐదో టీ20లో మూడు మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో మూడో టీ20కి దూరమైన బుమ్రా.. చివరి టీ20కి జట్టులోకి వచ్చేశాడు. హర్షిత్ రానా స్థానంలో బుమ్రా జట్టులోకి రానున్నాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్ టన్ జట్టులోకి రానున్నాడనే వార్తలు వస్తున్నాయి. అక్షర్ పటేల్ జట్టుకు దూరం కావడంతో బ్యాటింగ్ డెప్త్ కోసం సుందర్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఓపెనర్ శుభమాన్ గిల్ స్థానంలో సంజు శాంసన్ ప్లేయింగ్ 11 లోకి రానున్నాడు. నాలుగో టీ20 మ్యాచ్ కు ముందు గిల్ పాదానికి గాయమైంది. గిల్ అహ్మదాబాద్ వెళ్లినా చివరి టీ20 ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ మూడు మార్పులు మినహాయిస్తే ఎలాంటి సంచలన మార్పులు చోటు చేసుకోకపోవచ్చు.

Also Read :  ఐదో టీ20కి పొగమంచు సమస్య ఉందా

సఫారీల చేతిలో 0–2తో టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ కోల్పోయిన ఇండియా వన్డే సిరీస్‌‌‌‌ను గెలిచి కాస్త ఉపశమనాన్ని కలిగించింది. ఇప్పుడు టీ20 సిరీస్‌‌‌‌ను కూడా కైవసం చేసుకుంటే టీ20 వరల్డ్  కప్ ముంగిట జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. పొగమంచు వల్ల నాలుగో టీ20 రద్దు కావడంతో ఈ మ్యాచ్‌‌‌‌లో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. సూర్యకుమార్‌‌‌‌ ఫామ్‌‌‌‌పై తీవ్ర ఆందోళన కొనసాగుతోంది. ఈ ఏడాది 20 మ్యాచ్‌‌‌‌లు ఆడిన అతను 18 ఇన్నింగ్స్‌‌‌‌ల్లో ఒక్క హాఫ్‌‌‌‌ సెంచరీ కూడా చేయలేదు. 14.20 సగటుతో 213 రన్స్‌‌‌‌ మాత్రమే చేశాడు. దీనికి తోడు శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ టీ20 సెటప్‌‌‌‌కు సరిపోవడం లేదు. అతని కోసం ఓపెనింగ్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ శర్మతో మంచి జోడీ కుదిరిన  శాంసన్‌‌‌‌ను తప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య నాలుగు టీ20మ్యాచ్ లు జరిగాయి. ఇండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. తొలి టీ20లో ఇండియా గెలిస్తే.. సఫారీలు రెండో టీ20లో విజయం సాధించారు. మూడో టీ20లో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన టీమిండియా.. అలవోక విజయాన్ని అందుకుంది. తాజాగా నాలుగో టీ20 పొగమంచు కారణంగా రద్దయింది. సిరీస్ లోని చివరి మ్యాచ్ శుక్రవారం (డిసెంబర్ 19) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే 3-1 తేడాతో సిరీస్ గెలుస్తుంది. ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే సిరీస్ 2-2తో సమం అవుతుంది.

ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా) :

సూర్యకుమార్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), అభిషేక్‌‌‌‌ శర్మ, సంజూ శాంసన్‌‌‌‌, తిలక్‌‌‌‌ వర్మ, జితేష్‌‌‌‌ శర్మ, హార్దిక్‌‌‌‌ పాండ్యా, శివమ్‌‌‌‌ దూబే, సుందర్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, బుమ్రా, వరుణ్‌‌‌‌ చక్రవర్తి. 

సౌతాఫ్రికా ప్లేయింగ్ 11 (అంచనా) :

మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), డికాక్‌‌‌‌, హెండ్రిక్స్‌‌‌‌, బ్రెవిస్‌‌‌‌, మిల్లర్‌‌‌‌, ఫెరీరా, యాన్సెన్‌‌‌‌, కార్బిన్‌‌‌‌ బాష్‌‌‌‌, జార్జ్‌‌‌‌ లిండే / కేశవ్‌‌‌‌ మహారాజ్‌‌‌‌ / అన్రిచ్‌‌‌‌, ఎంగిడి, బార్ట్‌‌‌‌మన్‌‌‌‌.