ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం (డిసెంబర్ 19) చివరిదైన ఐదో టీ20 జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుతం టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో నాలుగు మ్యాచ్ లు జరిగితే 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టీ20 పోరులో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. లెక్క సరిచేయాలని ప్రొటీస్ పట్టుదలగా కనిపిస్తోంది. పొగమంచు వల్ల నాలుగో టీ20 రద్దు కావడంతో ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తున్న అహ్మదాబాద్ లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
అహ్మదాబాద్ వాతావరణ నివేదిక:
లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 కాలుష్యం కారణంగా రద్దయిన తర్వాత ఇప్పుడు అహ్మదాబాద్ లో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఫ్యాన్స్ లో నెలకొన్నాయి. అహ్మదాబాద్ లో పొగ మంచు సూచనలు కనిపించడం లేదు. కాలుష్యం, పొగమంచు సమస్య అడ్డంకిగా మారే అవకాశం లేదని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అహ్మదాబాదు లోని AQI స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్టు సమాచారం. ఇక్కడ AQI గత మూడు రోజులుగా కేవలం 139 మాత్రమే ఉంది. దీంతో మ్యాచ్ కు ఎలాంటి అంతరాయం ఉండదు. ఈ మ్యాచ్ లో వర్ష సూచనలు కూడా కనిపించడం లేదు. అయితే మ్యాచ్ జరిగే సమయంలో తేలికపాటి గాలులు వీచే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి.
Also Read : మెస్సీ ఈవెంట్ వివాదం.. ఫ్యాన్ కబ్ల్ ప్రెసిడెంట్‌పై గంగూలీ రూ. 50 కోట్ల దావా
నాలుగో టీ20 రద్దు:
దట్టమైన పొగమంచు కారణంగా.. ఇండియా, సౌతాఫ్రికా మధ్య బుధవారం జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ రద్దయింది. సాయంత్రం నుంచే స్టేడియం మొత్తాన్ని పొగమంచు ఆవరించి ఉండ5టంతో విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోయింది. దాంతో టాస్ వేయడాన్ని ఆలస్యం చేశారు. అక్కడి నుంచి ప్రతి అర్ధ గంటకు ఒకసారి అంపైర్లు గ్రౌండ్‌ను పరిశీలించారు. విజిబిలిటీ మెరుగుపడితే తక్కువ ఓవర్ల మ్యాచ్‌నైనా ఆడించేందుకు ప్రయత్నించారు. కానీ వాతావరణంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. 9.30 గంటలకు ఆరోసారి మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
