హైదరాబాద్ రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పై రోడ్డు ప్రమాదం జరిగింది. డిసెంబర్ 20న పిల్లర్ నంబర్ 253 దగ్గర ఉదయం ఒకదానికొకటి మూడు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో మూడు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కార్లలో ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనతో ప్లై ఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉప్పర్ పల్లి నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు..గాయాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కార్లను ఘటనా స్థలనం నుంచి తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఫ్లై ఓవర్ పై ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 16న ఉదయం పిల్లర్ నెంబర్ 112 దగ్గర ఒకదానికొకటి వరుసగా మూడు కార్లు ఢీ కొన్నాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఓవర్ స్పీడ్ తో వెళ్ళడం, సడెన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీ కొంటున్నాయి. ఫ్లై ఓవర్ పై వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు.
