ఏపీ మాజీ సీఎం జగన్ ఆస్తుల కేసు మళ్లీ మొదటికి వచ్చింది. నాంపల్లి సీబీఐ కోర్టు జడ్జి రఘురాం బదిలీ అయ్యారు. కొత్త న్యాయాధికారిగా పట్టాభిరామారావును నియమించారు. 2025 డిసెంబర్ 22 వ తేది తర్వాత రిలీవ్ కావాలని.... 29వ తేదీలోగా కొత్త పోస్టుల్లో చేరాలని ఉత్తర్వుల్లో జారీ అయ్యాయి. ఈ కోర్టులో 130 కేసులకు పైగా వాటికి సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్ లు పెండింగ్ లో ఉన్నాయి.
జడ్జ్ మారిన ప్రతిసారి జగన్ ఆస్తుల కేసు విచారణ మొదటికి వస్తుంది. ఏళ్ల తరబడి విచారణ కొనసాగుతున్న కూడా ఇంకా డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ పూర్తి కాలేదు. ప్రధాన కేసులు ట్రయల్ కి వెళ్లకుండా డిశ్చార్జ్ పిటిషన్లు వేసి జగన్ అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఆరుగురు న్యాయాధికారులు బదిలీలతో జగన్ ఆస్తుల కేసు మొదటికి వచ్చింది. న్యాయధికారి బదిలీ కాగానే మొదటి నుండి కేసు విచారణ చేస్తున్న కొత్త న్యాయధికారి జగన్ కేసులను త్వరగా విచారించి తీర్పులు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నందున విచారణ ముందుకు సాగడం లేదు.
జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి 2013 నుంచి దాఖలైన డిశ్చార్జి పిటిషన్‌లపై ఇప్పటి వరకు ఏడుగురు న్యాయమూర్తులు విచారణ చేపట్టారు. కానీ విచారణ పూర్తికాక ముందే వారంతా బదిలీ అయ్యారు. ప్రస్తుతం నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయమూర్తి రఘురాం కూడా బదిలీ కావడంతో ఈ కేసుల్లో విచారణ మళ్లీ మొదటికి వచ్చింది.
