అర్థరాత్రులు కూడా శ్రీశైలం ఘాట్ రోడ్డు ఓపెన్.. ప్రశాంతంగానే దర్శనాలు

 అర్థరాత్రులు కూడా శ్రీశైలం ఘాట్ రోడ్డు ఓపెన్.. ప్రశాంతంగానే దర్శనాలు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పై జిల్లా  జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ... శివరాత్రి రోజున ఉదయం 2: 20 దర్శనాలు ప్రారంభించి 20 గంటలపాటు దర్శనం కల్పిస్తూ గంటకు 6 నుండి 7 వేల మందికి దర్శనం కల్పిస్తూ.. 1 లక్ష 50 వేలమందికి దర్శనం కలిగేలా చేస్తామని, దీనికి భక్తులు సహకరించాలని కోరారు.  13,14,15 రోజుల్లో ఎవరికి శ్రీస్వామి అమ్మవార్లు కనపడలేదు అనే మాట రాకుండా చూస్తామని,.  క్యూ లైన్స్ పెంచి ఇబ్బందులు లేకుండా చూస్తామని అలానే శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండి అలానే కర్ణాటక నుండి సుమారు వేల బస్సులు వస్తాయని.. వాటి పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. అలాగే  13వ తేదీ నుండి 4 రోజుల వరకు రాత్రి సమయంలో కూడా పర్మిషన్ ఇస్తామన్నారు.