బంధువులు, పైగా పక్కింట్లో ఉన్నారు.. తెలిసిన వారే కదా నమ్మితే ఓ వృద్ధుడిని నట్టేట ముంచిన ఘటన ముంబైలో జరిగింది. కిరాణా వ్యాపారం చేస్తూ పైసా పైసా కూడబెడితే.. రియల్ ఎస్టేట్ లో కలిసి పెట్టుబడులు పెడతామని నమ్మించి లక్షలు కాజేశారు.. మోసపోయానని తెలుసుకున్న ఆ వృద్ధుడు చివరికి పోలీసులను ఆశ్రయించడంతో వారి బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని ఉడిపికి చెందిన 61 ఏళ్ల కిరాణా వ్యాపారి పాండురంగ కామత్.. గత కొన్నేండ్లుగా ముంబై శివారు ప్రాంతమైన ఖార్ లో నివాసం ఉంటున్నాడు. అతని బంధువులు అయిన మమతా గంగోలీ, ఆమె భర్త ప్రదీప్ గంగోలి పక్కనే కామత్ పక్కింట్లో ఉంటున్నారు. కిరాణా వ్యాపారి అయిన కామత్ బాగానే సంపాదించారు. ఈక్రమంలో అతని డబ్బుపై కన్ను పడిన మమతా, ప్రదీప్ గంగోలీలు..బ్యాంకులో పనిచేసే సమీరన్ దేశాయ్, సుదీర్ గార్గ్ అమ్రిష్ సింగ్, చార్టర్ అకౌంటెంట్ అయిన అభయ్ తివారీలో కలిసి పథకం ప్రకారం అతని దగ్గర డబ్బులు కాజేయం ప్రారంభించారు.
కార్ లోని ఓ బ్యాంకు ఆస్తులు రూ. 7 కోట్లకు వేలం వేస్తున్నారు. మనం ఆ ఆస్తులను కొనుగోలు చేద్దాం.. వేలం విలువలో 5 శాతం అంటే 35 లక్షలు మీరు పెట్టుబడి పెట్టండి.. మేం కూడా పెట్టుబడులు పెడుతున్నాం.. తర్వాత అమ్ముకుంటే నాలుగైదు రెట్లు లాభాలు వస్తాయి అని కామత్ ను నమ్మించారు. నిజమే అని నమ్మిన కామత్ డబ్బులను నిందితుల ఖాతాలకు బదిలీ చేశారు.
దాదాపు 10ఏళ్లుగా కామత్ నుంచి డబ్బులు గుంజుతూనే ఉన్నారు. 2014 నుంచి 2024 వరకుఈ మధ్య కాలంలో ప్రదీప్ గంగోలీ బ్యాంక్ ఖాతాలకు రూ. 34.91 లక్షలు బదిలీ చేశాడు కామత్. అయితే మోసం చేసే క్రమంలో డబ్బులు బ్యాంకు ఉద్యోగులైన రాజీవ్ బెనర్జీ అనే వ్యక్తి ఖాతాలకు బదిలీ అయ్యాయని అబద్ధాలు చెప్పాడు. కావాలంటే ఆర్బీఐ, బ్యాంకు ఉద్యోగులను సంప్రదించవచ్చని బుకాయించాడు.
దీంతో ఆందోళన చెందని కామత్.. ఆర్బీఐ అధికారులను కలిసేందుకు ప్రయత్నించగా వారు తిరస్కరించారు. బ్యాంకు ఉద్యోగులను సంప్రదించడంగా బెనర్జీ అనే ఉద్యోగి 2010లో నే రాజీనామా చేశారని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన కామత్ పోలీసులను ఆశ్రయించడంతో నిందితుల మోసపూరిత బండారం బయటపడింది.
రంగంలోకిదిగిన పోలీసులు.. ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు, చార్టర్డ్ అకౌంటెంట్ సుప్రీంకోర్టు న్యాయవాది సహా ఆరుగురు వ్యక్తులపై భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేపట్టింది.
