సల్మాన్ నెక్స్ట్ మూవీలో 10మంది హీరోయిన్లు

సల్మాన్ నెక్స్ట్ మూవీలో 10మంది హీరోయిన్లు

సల్మాన్‌‌ ఖాన్ సినిమా అంటే యాక్షన్‌‌ సీన్స్‌‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కభీ ఈద్, కభీ దివాలీ’ కూడా యాక్షన్ కామెడీ మూవీనే. అయితే ఈ సినిమా తర్వాత సల్మాన్ నటించబోయేది మాత్రం ఫుల్‌‌ లెంగ్త్ కామెడీ ఫిల్మ్. పదిహేడేళ్ల క్రితం వచ్చిన ‘నో ఎంట్రీ’కి సీక్వెల్. లాస్ట్‌‌ ఇయర్ డిసెంబర్‌‌‌‌లోనే దీన్ని కన్‌‌ఫర్మ్ చేశాడు సల్మాన్. ‘నో ఎంట్రీ మే ఎంట్రీ’ పేరుతో ఇది రూపొందనుంది. ఫస్ట్ పార్ట్‌‌ తీసిన అనీస్ బజ్మీనే సీక్వెల్‌‌ని కూడా డైరెక్ట్ చేయనున్నారు.

అందులో నటించిన సల్మాన్‌‌తో పాటు అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్‌‌ కూడా ఇందులో నటించబోతున్నారు. అయితే అప్పట్లో నలుగురు హీరోయిన్స్‌‌  నటించగా, ఈసారి ఆ సంఖ్య పదికి పెరగడం విశేషం. ముగ్గురు హీరోలూ ట్రిపుల్ రోల్స్ చేస్తుండడంతో ఇలా హీరోయిన్స్‌‌ కౌంట్ పెరిగిందట. కాకపోతే ‘నో ఎంట్రీ’లో నటించిన బిపాసా బసు, లారా దత్తా, ఇషా డియోల్, సెలీనా జైట్లీకి ఇందులో అవకాశం దక్కడం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ క్రేజీ కామెడీ సిరీస్‌‌లో నటించబోయే ఆ పదిమంది హీరోయిన్స్‌‌ ఎవరో!