HCU స్టూడెంట్ కు రూ.43 లక్షల ప్యాకేజీ

HCU స్టూడెంట్ కు రూ.43 లక్షల ప్యాకేజీ

హైదరాబాద్‍, వెలుగు: హైదరాబాద్‍ సెంట్రల్‍ యూనివర్సిటీ(HCU)లో ఎంసీఏ చదువుతున్న వి.నందిని సోని సంవత్సరానికి రూ.43 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ కొట్టేసింది. అడోబ్‍ సిస్టం కంపెనీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో ఆమె ఉద్యోగానికి ఎంపికైనట్లు ప్రొఫెసర్‍ రాజీవ్‍ వాంకర్‍ తెలిపారు. ప్లేస్‌మెంట్ గైడెన్స్ అండ్‍ అడ్వైజరీ బ్యూరో ఆధ్వర్యంలో యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్​ నిర్వహించామని ఆయన చెప్పారు.

అడోబ్‍ కంపెనీ ఉమెన్‍ ఎంపవరింగ్‍ కోసం ఏర్పాటు చేసిన ‘షీకోడ్స్’ ఆధ్వర్యం లో ఉమెన్‍ స్టూడెంట్స్‌కు ఆఫర్‍ ఇచ్చారు. నలుగురు స్టూడెంట్స్ షార్ట్ లిస్ట్ కాగా అందులో సోని ఫైనల్​ అయ్యింది. ‘సాఫ్ట్ వేర్‍ డెవలపర్‍’గా పనిచేయాలనే తన కోరిక దీనితో నెరవేరిందని తెలిపారు నందిని సోని.

see also: బీఎస్‌-6 పల్సర్ వచ్చింది..!

సర్కార్‌‌ సోలార్‌‌ పార్కులు లేనట్లే!