
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమాతో వస్తున్నాడు. ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’అనే సినిమాలో సౌత్ హీరోలతో కలిసి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నటించిన పాలక్ తివారి సల్లూభాయ్‌పై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ‘సల్మాన్ సెట్లో అమ్మాయిలు పద్ధతిగా బట్టలు వేసుకోవాలనే రూల్ ఉంటుంది. నెక్లైన్ పైకి ఉన్న బట్టలే వేసుకోవాలి. నేను నిండుగా కప్పుకునే బట్టలతో షూటింగ్‌కి వెళ్తుంటే మా అమ్మ మురిసిపోయేది. ఎవరికి నచ్చిన బట్టలు వారు వేసుకున్నా అభ్యంతరం చెప్పడు కానీ, అతను తన చుట్టూ ఉన్న అమ్మాయిలు సేఫ్‌గా ఉండాలని కోరుకుంటాడు’అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో సల్మాన్‌తో పాటుగా టాలీవుడ్ హీరో వెంకటేశ్, పూజా హెగ్దే, షెహనాజ్ గిల్ నటిస్తున్నారు.